- యూఏఈపై 168 బంతుల్లో ఆర్యవీర్ అద్భుత ఇన్నింగ్స్
- అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
- తొలుత ఆచితూచి ఆడిన ఆర్యవీర్.. కుదురుకున్నాక దూకుడు
- తండ్రితో పాటు కోహ్లీ తనకు స్ఫూర్తి అన్న మాటను నిజం చేస్తున్న ఆర్యవీర్
భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. తండ్రి తరహాలోనే మైదానంలో దూకుడు చూపించాడు. అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్యవీర్ 160 పరుగులతో చెలరేగాడు. 168 బంతులు ఎదుర్కొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే.
మ్యాచ్ ఆరంభంలో ఆర్యవీర్ ఆచితూచి ఆడాడు. తొలి పరుగులు చేసేందుకు 14 బంతులు తీసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కీలక మ్యాచ్‌లో అతడి శతకం భారత్‌ను పటిష్ఠ స్థితిలో నిలిపింది. చివరకు 168 బంతుల్లో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. 153 పరుగుల వద్దే ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు.
తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి చేసేవాడు. అయితే ఆర్యవీర్ తన ఆటతీరులో తండ్రి దూకుడుతో పాటు విరాట్ కోహ్లీ నుంచి స్ఫూర్తి పొందుతున్నట్లు గతంలో వెల్లడించాడు. దూకుడుగా ఆడటమంటే తనకు ఇష్టమని, సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ క్రికెట్ ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించి భారత్‌కు విజయాలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. దాన్ని ఆచరణలో పెడుతున్నట్లు తాజా ఇన్నింగ్స్‌తో స్పష్టమవుతోంది.