- సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ
- కొత్త పారిశ్రామిక పాలసీలకు గ్రీన్ సిగ్నల్
- భారీ పరిశ్రమలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేబినెట్ పలు ప్రధాన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ సమావేశంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31, ఏపీ రోబోటిక్స్ - ఫిజికల్ ఏఐ విధానాలతో పాటు సెమీ కండక్టర్ పాలసీ సవరణలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖ జిల్లా భీమునిపట్నంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నాయుడుపేటలో రూ.4,000.20 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అలాగే భోగాపురంలో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్‌కు 25 ఎకరాలు, తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు స్థలం కేటాయింపునకు ఆమోదం లభించింది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ యూనిట్ కు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉఫాధి లభించనుంది. పశ్చిమ గోదావరిలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,569 మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో సంస్థలకు 173.82 ఎకరాలు కేటాయించారు.
మరోవైపు, రాష్ట్రంలో రోడ్డు భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు, తిరుమల శ్రీవారి ఆలయంలో 'ప్రధాన సన్నిధి యాదవ', 'సన్నిధి యాదవ' పోస్టుల సృష్టికి కేబినెట్ నిర్ణయించింది. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా ఎస్ఎంఆర్ టెక్నాలజీతో అణు విద్యుత్ ప్లాంట్ల సాధ్యాసాధ్యాల పరిశీలనకు, రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయానికి భూ కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.