- సచివాలయంలో కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
- డిప్యూటీ సీఎం సహా హాజరైన పలువురు రాష్ట్ర మంత్రులు
- పెట్టుబడులు, పరిశ్రమలే లక్ష్యంగా 30కి పైగా అజెండా అంశాలు
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు ఇతర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ, యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ సాగుతోంది. దాదాపు 30కి పైగా కీలక అంశాలు కేబినెట్ ముందుకు చర్చకు వచ్చాయి.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) గతంలో ఆమోదించిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే నవంబర్ 11 నుంచి 13 వరకు విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక 'సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026' సన్నాహాలపై ముఖ్యమంత్రి మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నారు.
పారిశ్రామిక భూ కేటాయింపులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. భోగాపురంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు 24.96 ఎకరాలు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్‌కు 173.82 ఎకరాలు కేటాయించే అంశాలపై చర్చిస్తున్నారు. వీటితో పాటు జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, తిరుపతిలో వెబ్‌సోల్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు కేటాయించిన భూముల రద్దు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) సాంకేతికతతో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా కేబినెట్ కసరత్తు చేస్తోంది. భేటీ అనంతరం మంత్రులు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.