- ఆత్మకథలో సోనియా గాంధీ సంచలన వివరాలు
- 2000వ సంవత్సరంలో భారత పర్యటనకు వచ్చిన బిల్ క్లింటన్
- అధికారిక విందు ఏర్పాటు చేసిన అప్పటి ప్రధాని వాజ్ పేయి
- తన ఆత్మకథలో క్లింటన్ తీరును వివరించిన సోనియా
- తోడికోడలు మేనకా గాంధీతో సంబంధాలు క్షీణించిన తీరును కూడా ప్రస్తావించిన సోనియా
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో కుటుంబ, వ్యక్తిగత, అంతర్జాతీయ అంశాలపై ఎన్నో కీలక విషయాలను పంచుకున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర జ్ఞాపకాలను కూడా సోనియా గాంధీ పుస్తకంలో ప్రస్తావించారు. అప్పట్లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఏర్పాటు చేసిన అధికారిక విందులో క్లింటన్ ప్రవర్తనను ఆమె గమనించిన తీరును వివరించారు. అప్పటికే మోనికా లెవిన్స్కీ వివాదం సద్దుమణిగినప్పటికీ, 'పాత అలవాట్లు అంత త్వరగా పోవు' అన్నట్లుగా విందులో ఉన్న ఆకర్షణీయమైన మహిళలను క్లింటన్ చాటుగా గమనిస్తూ ఉండటాన్ని తాను చూశానని ఆమె రాశారు. అలాగే కశ్మీర్ అంశాన్ని క్లింటన్ ఒక ప్రమాదకరమైన 'న్యూక్లియర్ ఫ్లాష్పాయింట్'గా అభివర్ణించారని తెలిపారు.
వీరితో పాటు 2008లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారత్ పర్యటన, ఆ తర్వాత ఆయన కార్లా బ్రూనీతో కలిసి వచ్చిన సందర్భాలను, బ్రిటన్ ప్రిన్సెస్ డయానాతో తనకు గల పరిచయాన్ని కూడా సోనియా ఈ పుస్తకంలో విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా 1992లో భారత్ వచ్చినప్పుడు డయానాలోని విషాదం, తన తల్లితో డయానా ఇటాలియన్లో మాట్లాడిన తీరు, లండన్లోని ఓ హెయిర్ డ్రెస్సర్ వద్ద డయానాను అనుకోకుండా కలిసినప్పుడు జరిగిన చిన్నపాటి సంభాషణలను సోనియా గాంధీ తన ఆత్మకథలో నెమరువేసుకున్నారు.
ముఖ్యంగా తన తోడికోడలు, ప్రస్తుత బీజేపీ నాయకురాలు మేనకా గాంధీతో ఉన్న సంబంధాలు, కాలక్రమంలో అవి ఎలా క్షీణించాయనే విషయాన్ని ఆమె వివరంగా ప్రస్తావించారు.
1973 చివరి నాటికి సంజయ్ గాంధీ ద్వారా మేనక కుటుంబానికి పరిచయమయ్యారని, అప్పట్లో ఆమె ఎంతో ఉత్సాహవంతురాలైన చురుకైన అమ్మాయి అని సోనియా పేర్కొన్నారు. ఏడాది తిరిగేసరికి 18 ఏళ్ల వయసులో మేనక, సంజయ్ వివాహం జరిగిందని, తొలినాళ్లలో మేనక రాక ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన మార్పు తెచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రియాంకా గాంధీ తరచూ తన పిన్ని గదికి వెళ్లి ఆమె చెప్పే కథలను ఎంతో ఆసక్తిగా వినేవారని తెలిపారు.
అయితే క్రమంగా ఇంట్లోని పరిస్థితులు మారడం ప్రారంభించాయని సోనియా వివరించారు. ఇంట్లోని సిబ్బంది తనను 'బహురాణి' అని, మేనకను 'ఛోటీ బహు' అని పిలిచేవారని, అత్తగారు ఇందిరా గాంధీ ఇద్దరినీ సమానంగా చూసినప్పటికీ, మేనక ఆ సంబోధనలను తనను కించపరిచేలా ఉన్నట్లు భావించేవారని తెలిపారు. సంజయ్, మేనకల మధ్య మనస్పర్థలు క్రమంగా తీవ్రస్థాయికి చేరి, నాలుగు గోడల దాటి బయటకు వచ్చేవని రాశారు. కోపం వచ్చినప్పుడు మేనక ఇందిరా గాంధీ సమక్షంలోనే ఇంట్లో మాట్లాడకూడని అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవారని, అది తమకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేదని పేర్కొన్నారు.
1977 ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ ఓటమి పాలైన నేపథ్యంలో మేనక ప్రభావం వల్ల రాజీవ్, సంజయ్ సోదరుల మధ్య దూరం పెరిగిందని సోనియా వివరించారు. సంజయ్ మొండితనం, తొందరపాటు నిర్ణయాలే ఆ ఘోర పరాజయానికి కారణమని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, మేనక జోక్యం చేసుకోవడంతో కుటుంబంలో విభేదాలు మరింత పెరిగాయన్నారు.
1980 జూన్ 23న విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించిన తర్వాత పరిస్థితులు మరింత విషమించాయి. కేవలం 23 ఏళ్ల వయసు ఉన్న మేనకకు అప్పుడే క్రియాశీల రాజకీయ బాధ్యతలు అప్పగించడం తొందరపాటు అవుతుందని, పైగా మూడు నెలల పసికందు ఉన్నందున ఓపిక పట్టాలని ఇందిరా గాంధీ భావించారు. కానీ 1981 మార్చిలో ఆరెస్సెస్, రాజకీయ ప్రత్యర్థులకు చెందిన వసుంధర రాజే ఇంట్లో వరుణ్ గాంధీ మొదటి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ లండన్ పర్యటనలో ఉండగానే మేనక తన సామాన్లు సర్దుకుని, ఇందిరపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని సోనియా పేర్కొన్నారు.
తొలి బిడ్డ మరణం.. గుండె పగిలిన విషాదం
తోడికోడలితో విభేదాల అంశాన్ని ప్రస్తావించిన అనంతరం, తన వైవాహిక జీవితంలో ఎదురైన అత్యంత తీవ్రమైన వ్యక్తిగత విషాదాన్ని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. రాహుల్ గాంధీ పుట్టడానికి ఏడాది ముందు, అంటే 1969 జనవరి 18న నెలలు నిండకుండానే తమకు తొలి సంతానంగా పండంటి మగబిడ్డ జన్మించాడని తెలిపారు. నల్లటి జుట్టు, సన్నటి వేళ్లతో ఎంతో అందంగా కనిపించిన ఆ బిడ్డను చూసి తాము ఎంతగానో మురిసిపోయామని, అయితే ఆ ఆనందం కొన్ని గంటలకే ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంక్యుబేటర్లో ఉన్న ఆ చిన్నారి హఠాత్తుగా కన్నుమూశాడన్న వార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి, శోకసంద్రానికి గురిచేసిందని పేర్కొన్నారు.
ఆ వార్త వినగానే తాను, రాజీవ్ గాంధీ తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యామని, అప్పటికే ప్రధానిగా అధికారిక పర్యటనల్లో ఉన్న ఇందిరా గాంధీ వెంటనే పర్యటనలను రద్దు చేసుకుని ఆసుపత్రికి చేరుకున్నారని తెలిపారు. కళ్లు వాచిపోయి, ఎర్రబడిన స్థితిలో ఇందిర తమను హత్తుకుని ఓదార్చారని రాశారు. ఆ సమయంలో సంప్రదాయం ప్రకారం బిడ్డ భౌతికకాయాన్ని నదిలో కలపడానికి తాను అంగీకరించలేదని, దీంతో దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న ఫిరోజ్ గాంధీ వ్యవసాయ క్షేత్రంలో బొగన్విల్లా పూల చెట్టు కింద ఖననం చేశామని వెల్లడించారు. చాలా కాలం పాటు తాము అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఆ చెట్టు వద్ద ఒక పువ్వును ఉంచి నివాళులర్పించేవారమని ఆమె గుర్తుచేసుకున్నారు.