- రాప్తాడు దాడి బాధితురాలికి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతమైందన్న లోకేశ్
- గాయాలు మానుతున్నాయని, చేతి కదలికలు మొదలయ్యాయని వెల్లడి
- త్వరలో పీఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్పు
రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో మానసిక రోగి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతమైందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, బాధితురాలు వేగంగా కోలుకుంటోందని ఆయన తెలిపారు.
వైద్యులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గాయాలకు సంబంధించిన డీబ్రిడ్మెంట్, కుట్లను సరిచేసే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని లోకేశ్ పేర్కొన్నారు. బాలిక గాయాలు క్రమంగా నయమవుతున్నాయని, ఎడమ చేతికి ఉన్న స్లింగ్ను తొలగించడంతో ఆమె నెమ్మదిగా చేతిని కదిలిస్తోందని చెప్పారు. ఆ చిన్నారి ఎంతో ధైర్యంతో చికిత్సకు సహకరిస్తోందని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఆమెకు నొప్పి నివారణ మందులు, ఫీడింగ్ సపోర్ట్ అందిస్తున్నారని.. త్వరలోనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి జనరల్ వార్డుకు మార్చుతారని మంత్రి పేర్కొన్నారు.