- బ్రిటిష్ కాలంలో ఆక్స్‌ఫర్డ్ మ్యూజియానికి చేరిన నాగాల మానవ అవశేషాలు
- తిరిగి అప్పగించేందుకు అంగీకరించిన మ్యూజియం
- 30 మంది నాగా ప్రతినిధులతో బ్రిటన్‌లో ఒప్పందం
- పుర్రెలతో కూడిన ఈ అవశేషాలు 1910–1940 మధ్య ఆక్స్‌ఫర్డ్‌కు చేరినట్లు అంచనా
- ఒకే స్మారక స్థలం వద్ద గౌరవప్రదంగా సమాధి చేయాలని గిరిజన నాయకుల నిర్ణయం
బ్రిటిష్ వలస పాలన సమయంలో భారత్ నుంచి తీసుకెళ్లిన 39 మంది నాగా ప్రజల మానవ అవశేషాలను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పిట్ రివర్స్ మ్యూజియం సోమవారం వారి వారసులకు అప్పగించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈశాన్య భారతంలోని నాగాలాండ్ నుంచి 30 మంది బ్రిటన్‌కు వెళ్లారు. ఈ అప్పగింత చారిత్రక ఘట్టమని మ్యూజియం డైరెక్టర్ లారా వాన్ బ్రోఖోవెన్ పేర్కొన్నారు. ప్రధానంగా పుర్రెలతో కూడిన ఈ అవశేషాలను నాగాల సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, ఒకే స్మారక స్థలం వద్ద సమాధి చేయాలని గిరిజన నాయకులు నిర్ణయించారు.
19వ శతాబ్దంలో స్థాపించిన పిట్ రివర్స్ మ్యూజియంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగాల సంస్కృతికి సంబంధించిన వస్తు సేకరణ ఉంది. ఇందులో 6 వేలకు పైగా వస్తువులు ఉన్నాయి. 1910 నుంచి 1940 మధ్య కాలంలో నాగాలాండ్ నుంచి మానవ అవశేషాలను ఆక్స్‌ఫర్డ్‌కు తీసుకెళ్లారు. మానవ శాస్త్రవేత్తలుగా పనిచేసిన ఇద్దరు బ్రిటిష్ వలస పాలనాధికారులు వీటిలో ఎక్కువ భాగాన్ని సేకరించారు. అప్పట్లో కొన్ని వస్తువులను ప్రజల అంగీకారంతో కాకుండా, సైనిక దండయాత్రల సమయంలో బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు మ్యూజియం వెబ్‌సైట్ పేర్కొంటోంది.
ఈ అవశేషాల అప్పగింత ప్రక్రియ ఆరేళ్లపాటు కొనసాగిందని మ్యూజియం డైరెక్టర్ తెలిపారు. ఈ విషయంలో ఎన్నో అధికారిక అడ్డంకులను అధిగమించాల్సి వచ్చిందన్నారు. నాగాల ప్రతినిధులు గతేడాది కూడా బ్రిటన్‌ను సందర్శించి ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. అవశేషాల అప్పగింతపై ఇరు పక్షాలు అధికారిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
నాగాల నాయకుడు తెజావో విహిన్యునో మాట్లాడుతూ.. తమ పూర్వీకుల అవశేషాలను గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేస్తామని చెప్పారు. తమ భూమి నుంచి ఈ అవశేషాలను ఏ పరిస్థితుల్లో తీసుకెళ్లారో చెప్పడం కష్టమని, ఒక వ్యక్తి తన తండ్రి లేదా తాత పుర్రెను మరొకరికి బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. నాగాలు గతంలో శత్రువుల తలలను యుద్ధ విజయానికి గుర్తుగా తీసుకునే ఆచారం పాటించేవారు. గ్రామాల మధ్యలో తమ నాయకుల తలలను కూడా భద్రపరిచేవారని నాగాలాండ్‌కు చెందిన మానవ శాస్త్రవేత్త డాలీ కికోన్ తెలిపారు. తిరిగి అప్పగించిన అవశేషాల్లో ఒకటి గిరిజన నాయకుడిదని ఆమె వెల్లడించారు.
పాశ్చాత్య దేశాల్లోని మ్యూజియంలు వలస పాలన కాలంలో ఇతర దేశాల నుంచి సేకరించిన వస్తువులు, ముఖ్యంగా మానవ అవశేషాల విషయంలో తమ విధానాలను పునఃపరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సంస్థలు వాటిని మూల సమాజాలకు తిరిగి అప్పగిస్తున్నాయి. పిట్ రివర్స్ మ్యూజియం 2020లో మానవ అవశేషాలను ప్రదర్శన నుంచి తొలగించింది. అయినప్పటికీ మరో 2,700 అవశేషాలు ఇంకా నిల్వ ఉన్నాయని డైరెక్టర్ తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని ఆదివాసీ సమాజాలకు కూడా ఈ మ్యూజియం గతంలో మానవ అవశేషాలను తిరిగి అప్పగించింది.