- స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్న ఆనం
- ఆత్మకూరులో కూటమికి ప్రజలు అద్భుత విజయం అందించారని వెల్లడి
- రెండున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం, అభివృద్ధి పనులు జరిగాయని వ్యాఖ్య
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. ఈరోజు నెల్లూరులో పర్యటించిన ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ఆత్మకూరు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ కూటమి పార్టీల ఓట్ల మెజార్టీ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
వైసీపీకి కంచుకోటగా భావించే మేకపాటి కుటుంబ సొంత గ్రామంలో సైతం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని మంత్రి ఆనం గుర్తుచేశారు. ఈ ఫలితాన్ని బట్టి ఎన్నికలు ఎంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగాయో స్పష్టమవుతోందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గడిచిన రెండున్నరేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పెద్దఎత్తున అమలయ్యాయని తెలిపారు.
ఇటీవల రాజకీయాల్లోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించాయని మంత్రి వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎప్పుడూ నిరాశ చెందలేదని, ప్రజల నిర్ణయాన్ని గౌరవంగా స్వీకరించామని చెప్పారు. అయితే వైసీపీ నేతలకు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.