సీఎం చంద్రబాబును కలిసిన ఏషియన్ గేమ్స్ విజేతలు

సీఎం చంద్రబాబును కలిసిన ఏషియన్ గేమ్స్ విజేతలు

Chandrababu Naidu meets AP Asian Games winners
  • రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చారంటూ క్రీడాకారులను అభినందించిన సీఎం
  • మొత్తం 8 పతకాలు సాధించినట్లు వెల్లడించిన శాప్ ఎండీ
  • క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ
2026 ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి పతకాలు సాధించిన క్రీడాకారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. నేడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విజేతలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటిచెప్పినందుకు వారిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో క్రికెటర్ శ్రీచరణి, ఆర్చర్లు గణేశ్ మణిరత్నం, ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖ ఉన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడాకారులు సాధించిన పతకాల వివరాలను శాప్ (SAAP) ఎండీ భరణి ముఖ్యమంత్రికి వివరించారు. మూడు వేర్వేరు క్రీడాంశాల్లో మన అథ్లెట్లు 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 8 పతకాలను గెలుచుకున్నారని ఆయన తెలిపారు.

ఈ విజయాల స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహకాలతో పాటు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Asian Games Winners
Andhra Pradesh Sports
Jyothi Surekha Vennam
Dhiraj Bommadevara

More Telugu News