ఎన్నికల 'మ్యాచ్ ఫిక్సింగ్'.. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్
Advertisement

ఎన్నికల 'మ్యాచ్ ఫిక్సింగ్'.. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్

Narendra Modi must resign over election match fixing says Congress
  • ఎన్నికల ప్రక్రియలో 'మ్యాచ్ ఫిక్సింగ్' జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపణ
  • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్
  • 13.30 కోట్ల ఓట్లను తొలగించారని, వాటిని పునరుద్ధరించాలని తీర్మానం
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని పట్టు
  • పార్లమెంటు, కోర్టులు, వీధుల్లో పోరాడతామని కాంగ్రెస్ ప్రకటన
ఎన్నికల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానాన్ని ఆమోదించారు.

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రధాని, ఎన్నికల సంఘం మధ్య జరుగుతున్న 'మ్యాచ్ ఫిక్సింగ్'గా కాంగ్రెస్ అభివర్ణించింది. ప్రధాని, హోంమంత్రి తరఫున ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ 'ఓట్ల దొంగతనానికి' పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సీఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను నిలిపివేయాలని తీర్మానంలో పేర్కొంది. జాబితా నుంచి అన్యాయంగా తొలగించిన 13.30 కోట్ల ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఈ సమావేశంలో దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కేవలం ప్రతిపక్షం మాత్రమే కాదని, అది ఒక 'ప్రతిఘటన' పార్టీ అని స్పష్టం చేశారు. ఓటు హక్కు పునరుద్ధరణ కోసం తాము చేసే పోరాటం స్వాతంత్ర్య సంగ్రామంతో సమానమని తీర్మానంలో ఉద్ఘాంటించారు. ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి పొందే వరకు పార్లమెంటు, న్యాయస్థానాలు, వీధుల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Advertisement
Narendra Modi
Congress Party
Rahul Gandhi
Election Match Fixing
Mallikarjun Kharge
Election Commission

More Telugu News