నెల జీతం రూ.1.8 లక్షలు.. అయినా ఫ్లాట్ కొనలేను: బెంగళూరు టెకీ ఆవేదన
- నెలకు లక్షా 80 వేల జీతం అయినా ఇల్లు కొనలేకపోతున్నానని యువకుడి ఆవేదన
- బెంగళూరులో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలపై సోషల్ మీడియాలో చర్చ
- రూ. 1.3 కోట్లకు అగ్గిపెట్టె లాంటి ఫ్లాట్లే వస్తున్నాయని వాపోయిన టెకీ
- యువతకు సొంత ఇల్లు ఒక కలగానే మిగిలిపోతోందని నెటిజన్ల కామెంట్లు
"మంచి జీతం ఉంచే చాలు. సొంత ఇల్లు కొనుక్కోవచ్చు" అనే అంచనాలు నేటి తరానికి సరిపోయేలా లేవు. నెలకు రూ.1.8 లక్షల వేతనం వస్తున్నప్పటికీ, బెంగళూరు వంటి నగరంలో గౌరవప్రదంగా ఒక ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేయలేకపోతున్నానంటూ ఓ 25 ఏళ్ల యువకుడు వ్యక్తం చేసిన ఆవేదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది 'జెన్-జెడ్' తరం ఎదుర్కొంటున్న కఠిన వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.
బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా పనిచేస్తున్న ఆ యువకుడు తన ఆర్థిక స్థితిగతులు, సొంతింటి కలను వివరిస్తూ ఒక పోస్ట్ చేశాడు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన అతను, నెలకు రూ.1.8 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ ఎంతో పొదుపుగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం పీజీలో నివసిస్తూ నెలకు రూ.31,000 ఖర్చు చేస్తున్నాడు. విలాసాలకు పోకుండా కారుకు బదులు స్కూటర్‌నే వినియోగిస్తున్నాడు. ప్రతి నెలా సుమారు రూ.75,000 'సిప్' రూపంలో పెట్టుబడి పెడుతూ, మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తున్నాడు.
సుమారు రూ.1.3 కోట్లతో ఒక మంచి ఇల్లు కొనవచ్చని అతను అంచనా వేశాడు. ఈ బడ్జెట్‌తో బ్రోకర్‌లను సంప్రదించి ఇందిరానగర్, వైట్‌ఫీల్డ్ వంటి ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించాడు. అయితే, ఆ బడ్జెట్‌లో కేవలం సాధారణ అపార్ట్‌మెంట్లలో ఇరుకైన 2బీహెచ్‌కే ఫ్లాట్లు మాత్రమే లభిస్తుండటంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. మరోవైపు, వసతులున్న గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్ల ధరలు రూ.2 కోట్లు దాటుతున్నాయని అతను గుర్తించాడు. పుణే వంటి నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని అతను వాపోయాడు.
ఈ నేపథ్యంలో, మరో ఐదేళ్ల పాటు ఇలాగే పొదుపుగా జీవించాలా లేక కొత్తగా మరిన్ని పెట్టుబడులు ప్రారంభించాలా అనే గందరగోళంలో అతను ఉన్నాడు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మెట్రో నగరాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటాయని, చాలా మంది 35 నుండి 40 ఏళ్ల వయసు దాటాకే ఇల్లు కొనగలుగుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. అధిక జీతాలు పొందుతున్నప్పటికీ, సొంత ఇల్లు అనేది నేటి యువతకు, మధ్యతరగతికి ఒక కలగానే మిగిలిపోతోందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.