నిద్రపోతే రూ.13.7 లక్షలు.. జపాన్‌లో భలే వింత పోటీ!
- అక్టోబర్ 5న టోక్యోలో పోటీ
- ఒక్కొక్కరికి 90 నిమిషాల నిద్ర సమయం
- గాఢ నిద్ర, స్థిరత్వాన్ని ప్రత్యేక పరికరాలతో పరిశీలన
- నిద్ర మాత్రలు, ముందు రోజు మేల్కొని ఉండడం కుదరదు
- నాణ్యమైన నిద్రపై అవగాహన కల్పించడమే లక్ష్యం
నిద్రపోవడమంటే విశ్రాంతి తీసుకోవడమే అనుకుంటాం. కానీ జపాన్‌లో మాత్రం నిద్రపోతే ఏకంగా లక్షలు గెలుచుకునే అవకాశం వచ్చింది. ఒక జపాన్ మ్యాట్రెస్ కంపెనీ నిద్రపై ప్రత్యేక పోటీ నిర్వహించనుంది. ఇందులో ఎవరు అత్యుత్తమంగా నిద్రపోతారో తేల్చి.. విజేతకు 22.2 లక్షల యెన్‌లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.13.76 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు.
అక్టోబర్ 5న టోక్యోలోని షేర్ గ్రీన్ మినామి అయోమాలో ఈ పోటీ జరగనుంది. పోటీలో పాల్గొనేవారికి 90 నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయంలో వారు ఎంత త్వరగా నిద్రలోకి జారుకున్నారు? ఎంత గాఢంగా నిద్రపోయారు? నిద్ర ఎంత స్థిరంగా కొనసాగింది? వంటి అంశాలను ప్రత్యేక పరికరాలతో నిర్వాహకులు పరిశీలిస్తారు.
అయితే పోటీకి ముందు కంటెస్టెంట్లకు కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరికీ దిండు, దుప్పటి, కంటి ముసుగు లాంటి ఏదో ఒక నిద్ర వస్తువు కేటాయిస్తారు. పోటీ కోసం ముందుగానే రాత్రంతా మేల్కొని ఉండటం, కావాలనే నిద్రకు దూరంగా ఉండటం వంటి వాటికి అనుమతి లేదు. సహజంగా వచ్చే నిద్రనే పరీక్షించాలన్నది నిర్వాహకుల ఉద్దేశం.
నిద్ర పట్టేందుకు నిద్రమాత్రలు లేదా ఇతర మందులు వాడటంపైనా నిషేధం ఉంది. పోటీ సమయంలో నిర్వాహకులు కావాలనే కొన్ని అనూహ్యమైన అంతరాయాలు కలిగించే అవకాశం కూడా ఉంది. వాటి మధ్య కూడా నిద్రను ఎంత స్థిరంగా కొనసాగిస్తారన్నది పరిశీలించనున్నారు.
ప్రధాన విజేతతో పాటు ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి కూడా బహుమతులు అందించనున్నారు. గాఢ నిద్రలోకి జారుకున్న వారికి ‘డీప్ స్లీప్ డైవ్ అవార్డు’, చిత్రమైన భంగిమలో నిద్రపోయిన వారికి మరో ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు.
పోటీకి దరఖాస్తు చేసుకోవడం ఉచితం. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మూడు విడతల్లో పోటీ నిర్వహించి, ఒక్కో విడతలో సుమారు 20 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జపాన్‌లో పెరుగుతున్న నిద్రలేమి సమస్యపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విశ్రాంతి ప్రాధాన్యాన్ని చాటడమే ఈ పోటీ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.