నీళ్లలో మరింత బలంగా మారే సూపర్‌గ్లూ.. 10 సెకన్లలో అతుక్కుని ఏళ్ల తరబడి బలంగా!
- నీళ్లలో 10 సెకన్లలో గట్టిగా అతుక్కునే సూపర్‌గ్లూను తయారు చేసిన శాస్త్రవేత్తలు
- మూడేళ్లకు పైగా నీటిలో ఉంచినా రెండు కిలోల బరువును మోసిన వైనం
- నీరు తగిలిన వెంటనే మరింత బలమైన బంధాన్ని ఏర్పరచుకునే గుణం
- ఆమ్లం, క్షారం, ఉప్పు కలిసిన నీటిలోనూ పనిచేసిన గ్లూ
- 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి వద్ద తగ్గిన పనితీరు
గ్లూ అంటే ఏం గుర్తొస్తుంది? రెండు వస్తువులను అతికించాలి.. కొంతసేపు ఆరనివ్వాలి.. అంతే! కానీ అదే గ్లూను నీళ్లలో ఉపయోగించాలంటే మాత్రం పెద్ద సవాలే. నీరు వస్తువుల ఉపరితలంపై ఓ పలుచటి పొరలా ఉండటంతో గ్లూ సరిగా పట్టుకోదు. పైగా నీటి ప్రవాహానికి అది క్రమంగా కొట్టుకుపోతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ సమస్యకే ఓ ఆసక్తికరమైన పరిష్కారం కనుగొన్నారు. నీళ్లలోనే కేవలం 10 సెకన్లలో గట్టిగా అతుక్కునే సూపర్‌గ్లూను తయారు చేశారు. అంతేకాదు.. మూడేళ్లకు పైగా నీటిలో ఉంచినా రెండు కిలోల బరువును మోసింది!
నీళ్లలోనే బలంగా మారుతుంది..
కొత్తగా తయారు చేసిన ఈ పదార్థం సాధారణ గ్లూలకు పూర్తి భిన్నంగా పనిచేస్తుంది. నీటిని తాకగానే ఇందులోని చిన్న చిన్న కణాలు తమ అమరికను మార్చుకుంటాయి. ఒకదానితో ఒకటి బలంగా బంధం ఏర్పరచుకుంటాయి. దీంతో తొలుత ద్రవంలా ఉన్న పదార్థం క్రమంగా గట్టిగా, నీటిని తట్టుకునే పొరగా మారుతుంది.
ఇందుకోసం పరిశోధకులు బీపీ16టీపీబీ అనే ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగించారు. దానికి డీఎంఎస్‌ఓ అనే ద్రావకాన్ని కలిపారు. నీరు తగిలిన వెంటనే ఈ మిశ్రమంలోని కణాలు తిరిగి కలిసి బలమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అవి ఒకదానితో ఒకటి పట్టుకునేలా ప్రత్యేక రసాయన బంధాలు ఏర్పడతాయి.
నీటిని ముందే తరిమేస్తుంది!
ఈ గ్లూ మరో ప్రత్యేకత.. నీటిని దూరంగా నెట్టేయడం. సాధారణంగా ఏదైనా వస్తువు నీటిలో ఉంటే దాని ఉపరితలంపై నీటి పొర ఏర్పడుతుంది. అదే గ్లూ పట్టుకోకుండా అడ్డుకుంటుంది. కొత్త పదార్థం మాత్రం ఆ నీటి పొరను తొలగించి నేరుగా ఉపరితలాన్ని పట్టుకునేలా పనిచేస్తుంది.
పరిశోధకులు దీన్ని సిరామిక్, ఎపాక్సీ, ప్లాస్టిక్ వంటి వివిధ పదార్థాలపై నీటిలో పరీక్షించారు. కేవలం 10 సెకన్ల తర్వాత 1.1 మిలియన్ పాస్కల్స్ అంటుకునే బలాన్ని నమోదు చేసింది. ఇది ఇప్పటివరకు, నీటిలో వినియోగించే అనేక గ్లూల కంటే చాలా ఎక్కువ.
మూడేళ్లు నీటిలో ఉన్నా..
దీని బలం ఎంతకాలం ఉంటుందో తెలుసుకునేందుకు మరో పరీక్ష చేశారు. గ్లూతో అతికించిన వస్తువుకు 2 కిలోల బరువు తగిలించి, దాన్ని మూడు సంవత్సరాలకు పైగా నీటిలోనే ఉంచారు. అంతకాలం తర్వాత కూడా ఆ బంధం కొనసాగింది. అంతేకాదు.. ఒకసారి అతికించిన తర్వాత విడదీసి మళ్లీ అతికించినా పనిచేసింది. నీటిలోనే ఇలా ఎనిమిది సార్లు విడదీసి, తిరిగి అతికించినా దాదాపు అదే స్థాయిలో బలం చూపించింది.
సముద్రంలోనూ ఉపయోగపడొచ్చు
ఆమ్లం, క్షారం, ఉప్పు కలిసిన నీటిలోనూ ఈ గ్లూ పనిచేసింది. అయితే 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి వద్ద దీని పనితీరు తగ్గుతుంది. భవిష్యత్తులో సముద్రంలో ఉండే పైప్‌లైన్లు, నీటిలోని నిర్మాణాలు, ఇతర పరికరాల మరమ్మతుల్లో ఈ సాంకేతికత ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ పరిశోధన నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైంది.