- టపాసుల శబ్దం 125 డెసిబుల్స్ వరకు ఉండొచ్చంటున్న నిబంధనలు
- చట్టబద్ధమైన శబ్ద స్థాయి సురక్షితమని అర్థం కాదంటున్న నిపుణులు
- టపాసులు దగ్గరగా ఉన్నప్పుడు పేలితే వినికిడి దెబ్బతినే ప్రమాదం
- పిల్లల చెవులకు శబ్దం వల్ల మరింత ముప్పు
- లోపలి చెవిలోని కణాలు దెబ్బతింటే శాశ్వత నష్టం
దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్ల ముందు దీపాల వెలుగులు, వీధుల్లో టపాసుల మోతలు. చిన్నారుల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చుతూ పండగను ఆనందంగా జరుపుకొంటారు. అయితే టపాసుల శబ్దం మన చెవులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చాలామందికి తెలియదు. భారత చట్టాల ప్రకారం టపాసుల శబ్దం 125 డెసిబుల్స్ వరకు ఉండొచ్చు. కానీ చట్టం అనుమతించినంత మాత్రాన అది చెవులకు సురక్షితమని కాదు. ముఖ్యంగా టపాసులు పేలే ప్రదేశానికి దగ్గరగా ఉంటే వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నెల 8న దీపావళి జరగనుండగా, చెవుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
125 డెసిబుల్స్ అంటే ఎంత పెద్ద శబ్దం?
శబ్ద తీవ్రతను కొలిచే ప్రమాణాన్ని డెసిబుల్ అంటారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సమయంలో శబ్దం 60 డెసిబుల్స్ వరకు ఉంటుంది. రద్దీగా ఉండే రహదారిపై వాహనాల శబ్దం దాదాపు 85 డెసిబుల్స్‌గా ఉంటుంది. అదే టపాసుల శబ్దం 125 డెసిబుల్స్ వరకు ఉండొచ్చు. అంటే సాధారణ ట్రాఫిక్ శబ్దంతో పోలిస్తే టపాసుల నుంచి వెలువడే శబ్దం చాలా ఎక్కువ. ప్రతి 10 డెసిబుల్స్ పెరిగినప్పుడు శబ్ద తీవ్రత పది రెట్లు పెరుగుతుంది. అందువల్ల ఈ తేడాను తక్కువ అంచనా వేయొద్దు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టపాసుల శబ్ద తీవ్రతను అవి పేలిన ప్రదేశానికి నాలుగు మీటర్ల దూరంలో కొలుస్తారు. కానీ దీపావళి సమయంలో చాలామంది అంత దూరం పాటించరు. టపాసులు చేతిలో పట్టుకుని కాల్చడం, అవి పేలే సమయంలో దగ్గరగా నిలబడటం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.
ఎంత శబ్దం చెవులకు ప్రమాదకరం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కసారిగా వచ్చే తీవ్రమైన శబ్దం గరిష్ఠ స్థాయి పెద్దవారికి 140 డెసిబుల్స్, పిల్లలకు 120 డెసిబుల్స్ మించకూడదు. అయితే టపాసుల శబ్దం ఎంత ప్రమాదకరమవుతుందనేది అవి పేలే ప్రదేశానికి మనం ఎంత దూరంలో ఉన్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
శబ్దం వెలువడే ప్రదేశానికి దూరం సగానికి తగ్గిన ప్రతిసారీ దాని తీవ్రత సుమారు 6 డెసిబుల్స్ పెరుగుతుంది. ఉదాహరణకు.. నాలుగు మీటర్ల దూరంలో 125 డెసిబుల్స్‌గా నమోదైన టపాసు శబ్దం, రెండు మీటర్ల దూరంలో 131 డెసిబుల్స్‌కు చేరుతుంది. ఒక మీటరు దూరంలో 137 డెసిబుల్స్, అర మీటరు దూరంలో 143 డెసిబుల్స్ అవుతుంది. అంటే చట్టబద్ధంగా అనుమతించిన టపాసు కూడా చేతిలో పట్టుకుని కాల్చినప్పుడు పెద్దవారి చెవులకు ప్రమాదకర స్థాయికి చేరవచ్చు. దాని దగ్గరగా వంగి నిలబడే చిన్నారులకు మరింత ముప్పు ఉంటుంది.
చెవుల లోపల ఏం జరుగుతుంది?
మన చెవిలో బయటకు కనిపించే భాగం లోపల కర్ణభేరి ఉంటుంది. ఇది పలుచని పొరలా ఉండి శబ్ద తరంగాలు తాకినప్పుడు కంపిస్తుంది. ఆ కంపనాలు చెవిలోని మూడు చిన్న ఎముకల ద్వారా లోపలి చెవిలో ఉండే నత్తగుల్ల ఆకారపు భాగానికి చేరతాయి. దానిని కాక్లియా అంటారు. ఇందులో దాదాపు 15 వేల సూక్ష్మమైన వెంట్రుకల్లాంటి కణాలు ఉంటాయి. ఇవి శబ్దాన్ని మెదడుకు చేరే సంకేతాలుగా మారుస్తాయి. మనం వినగలగడానికి ఇవి ఎంతో కీలకం.
సాధారణంగా సంభాషణ సమయంలో వచ్చే శబ్దం ఈ కణాలపై పెద్దగా ఒత్తిడి కలిగించదు. కానీ టపాసులు దగ్గరగా పేలినప్పుడు ఒక్కసారిగా వెలువడే తీవ్రమైన శబ్దం వీటిని దెబ్బతీయవచ్చు. కొన్ని సందర్భాల్లో కర్ణభేరి చిట్లిపోవచ్చు. అరుదుగా చెవిలోని చిన్న ఎముకల మధ్య ఉండే కీళ్లు కూడా దెబ్బతినవచ్చు. కర్ణభేరికి ఏర్పడిన చిన్న చీలికలు కొన్ని వారాల్లో వాటంతట అవే మానిపోయే అవకాశం ఉన్నా, లోపలి చెవిలోని వెంట్రుకల్లాంటి కణాలు దెబ్బతింటే అవి తిరిగి పెరగవు. ఫలితంగా వినికిడి లోపం శాశ్వతంగా మిగిలిపోవచ్చు.
టపాసుల శబ్దం ఎందుకు మరింత ప్రమాదకరం?
పెద్ద శబ్దం వినిపించినప్పుడు మన చెవిలోని చిన్న కండరాలు బిగుసుకుని లోపలి చెవికి చేరే కంపనాలను కొంతవరకు తగ్గిస్తాయి. దీనిని ‘అకౌస్టిక్ రిఫ్లెక్స్’ అంటారు. అయితే ఈ రక్షణ వ్యవస్థ పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. టపాసు పేలినప్పుడు శబ్దం ఒక్కసారిగా, క్షణంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అప్పటికే చెవిపై ప్రభావం పడిపోతుంది. పైగా టపాసు ఎప్పుడు పేలుతుందో ముందుగా తెలియదు కాబట్టి చెవులు ఆ శబ్దానికి సిద్ధమయ్యే అవకాశమూ ఉండదు.
ఇతర పెద్ద శబ్దాలతో పోలిస్తే టపాసుల పేలుడు శబ్దం మరింత ప్రమాదకరమవడానికి ఇదే ప్రధాన కారణం. ఇలాంటి ఆకస్మిక శబ్దాలను ఇంపల్స్ నాయిస్ అంటారు. తుపాకీ పేలుడు, టపాసుల మోత కూడా ఈ కోవలోకే వస్తాయి.
ఇరుకు వీధుల్లో శబ్దం మరింత ఎక్కువ
బహిరంగ ప్రదేశంలో ఒక టపాసు పేలినప్పుడు వచ్చే శబ్దానికి, ఇరుకైన వీధిలో వచ్చే శబ్దానికి తేడా ఉంటుంది. ఇళ్ల గోడలు, భవనాలు శబ్ద తరంగాలను తిరిగి వెనక్కి పంపుతాయి. దీంతో అసలు శబ్దానికి అదనంగా ప్రతిధ్వని కలుస్తుంది. శబ్దం ఎక్కువసేపు వినిపించడమే కాకుండా దాని తీవ్రత కూడా పెరగవచ్చు. ఒకేసారి ఎక్కువ టపాసులు పేల్చినప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సమాన తీవ్రత కలిగిన రెండు శబ్దాలు కలిస్తే దాదాపు 3 డెసిబుల్స్, పది శబ్దాలు కలిస్తే సుమారు 10 డెసిబుల్స్ పెరుగుతుంది.
చెవులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
టపాసులు పేల్చే ప్రదేశానికి కనీసం నాలుగు నుంచి ఐదు మీటర్ల దూరంలో ఉండాలి. వాటిని చేతిలో పట్టుకుని ఎప్పుడూ కాల్చకూడదు. చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వారికి సరైన విధంగా చెవుల్లో పెట్టుకునే ఫోమ్ ఇయర్‌ప్లగ్స్ లేదా చెవులను పూర్తిగా కప్పే ఇయర్‌మఫ్స్ ఉపయోగించవచ్చు. ఇవి శబ్ద తీవ్రతను 20 నుంచి 30 డెసిబుల్స్ వరకు తగ్గించగలవు. చెవుల్లో దూది పెట్టుకుంటే పెద్దగా రక్షణ లభించదు.
చిన్న పిల్లలు, వృద్ధులు టపాసుల మోతకు దూరంగా ఇంట్లోనే ఉండటం మంచిది. తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఒకేసారి ఎక్కువ టపాసులు పేల్చే రద్దీ వీధులు, భవనాల పైకప్పులపై ఉండటం కూడా మంచిది కాదు. పండగ తర్వాత చెవుల్లో నొప్పి, మోత, రక్తస్రావం కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకూడదు. చెవుల్లో నూనె లేదా ఇతర చుక్కలు వేసే ప్రయత్నం చేయకుండా ఆడియాలజిస్ట్ లేదా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలి.