భూమిపై అత్యంత శీతల ప్రదేశం ఇదే.. 14 ఏళ్ల రికార్డు బద్దలు!
- అంటార్కిటికాలో మైనస్ 84.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
- కాంకోర్డియా పరిశోధన కేంద్రంలో ఈ అరుదైన ఘటన
- 1983లో నమోదైన మైనస్ 89.2 డిగ్రీలే ఇప్పటికీ ప్రపంచ రికార్డు
- వాతావరణ మార్పుల మధ్య ఇలాంటి తీవ్రతలు సహజమేనంటున్న శాస్త్రవేత్తలు
భూగోళంపై గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అంటార్కిటికాలోని కాంకోర్డియా పరిశోధన కేంద్రంలో 2026 జులై 18 రాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 84.1 డిగ్రీల సెల్సియస్‌కు (మైనస్ 119.4 ఫారెన్‌హీట్) పడిపోయింది. 2012లో రష్యాకు చెందిన వోస్టోక్ స్టేషన్‌లో మైనస్ 84.2 డిగ్రీలు నమోదైన తర్వాత భూమిపై నమోదైన అత్యంత శీతల ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.
ఫ్రాన్స్, ఇటలీ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కాంకోర్డియా స్టేషన్, అంటార్కిటిక్ పీఠభూమిపై సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నెలల తరబడి సూర్యరశ్మి సోకని ధ్రువ రాత్రి, అత్యంత పొడి గాలులు, స్పష్టమైన ఆకాశం ఉండటంతో భూమిపై వేడి అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతాయి.
అయితే, భూమిపై ఇప్పటివరకు నేరుగా కొలిచిన ఉష్ణోగ్రతల్లో అత్యల్ప రికార్డు 1983 జులై 21న వోస్టోక్ స్టేషన్‌లో నమోదైన మైనస్ 89.2 డిగ్రీల సెల్సియస్ (మైనస్ 128.6 ఫారెన్‌హీట్). శాటిలైట్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు మైనస్ 98 డిగ్రీల వరకు ఉన్నప్పటికీ, వాటిని అధికారిక గాలి ఉష్ణోగ్రత రికార్డులుగా పరిగణించరు.
ఈ ఘటనపై స్టేషన్ లీడర్ గాబ్రియేల్ కరుగాటి స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో ఇలాంటి తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం విరుద్ధమేమీ కాదని స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలకు భిన్నంగా ఉండవచ్చని ఆయన వివరించారు. ఇటీవలే అంటార్కిటికాలో కొన్నిచోట్ల అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.