‘చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌’.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. ఇలాంటి ఉద్యోగాలూ ఉంటాయా?

Chief Breakup Officer salary 28 lakhs per month do such jobs exist
  • బ్రేకప్‌ చెప్పేందుకు 'చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌' ఉద్యోగం
  • భాగస్వామి తరఫున సున్నితంగా బ్రేకప్‌ చెప్పడమే బాధ్యత
  • ‘ఘోస్టింగ్‌’ సంస్కృతిని తగ్గించడమే కంపెనీ లక్ష్యం
  • కనీసం 3 బ్రేకప్‌ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
  • ‘రిలేషన్‌షిప్‌’, ‘సిచ్యుయేషన్‌షిప్‌’, ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ మధ్య తేడా తెలిసి ఉండాలని షరతు
ప్రేమ ఎందుకు, ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒకసారి బంధం ఏర్పడ్డాక.. దాన్ని ముగించడం మాత్రం అంత తేలిక కాదు. చాలామంది తమ భాగస్వామికి నేరుగా బ్రేకప్‌ చెప్పలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి సమస్యను అవకాశంగా మార్చుకుంది ఓ కంపెనీ. మీ బదులు మీ పార్ట్‌నర్‌కు బ్రేకప్‌ చెప్పే ఉద్యోగానికి నెలకు దాదాపు రూ.2.8 లక్షల జీతం ఇస్తామంటోంది. వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌ డేటింగ్‌ సంస్థ డేటింగ్‌.కామ్‌ వినూత్న ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ‘చీఫ్‌ బ్రేకప్‌ ఆఫీసర్‌’ పేరుతో పూర్తిగా ఇంటి నుంచే చేసే (రిమోట్‌) ఉద్యోగాన్ని ప్రకటించింది. ఎంపికైన వారికి నెలకు 3,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2.8 లక్షలు) వేతనం అందించనుంది.

ఈ ఉద్యోగంలో ప్రధాన బాధ్యత.. తమ భాగస్వామితో బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్న వారి తరఫున బ్రేకప్‌ విషయాన్ని మర్యాదగా, సున్నితంగా తెలియజేయడం. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా పరిస్థితికి తగ్గట్లుగా సంభాషించాలి. అలాగే ఆ బ్రేకప్‌ ఎంత క్లిష్టమో కూడా అంచనా వేయాలి.

ఈ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలని కంపెనీ తెలిపింది. కనీసం మూడు బ్రేకప్‌ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ‘రిలేషన్‌షిప్‌’, ‘సిచ్యుయేషన్‌షిప్‌’, ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ మధ్య తేడా తెలిసి ఉండాలని షరతు విధించింది.

ఈ ఉద్యోగాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ‘ఘోస్టింగ్‌’ సంస్కృతిని తగ్గించడమేనని డేటింగ్‌.కామ్‌ వెల్లడించింది. అంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా బంధాన్ని తుంచేసుకునే ధోరణిని ఆపేయాలని భావిస్తోంది.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. జెన్‌-జీ, మిల్లీనియల్స్‌లో 84 శాతం మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఘోస్టింగ్‌కు గురయ్యారు. అందుకే బ్రేకప్‌ను గౌరవప్రదంగా, స్పష్టంగా చెప్పే విధానాన్ని ప్రోత్సహించేందుకు ఈ కొత్త ఉద్యోగాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించింది.
Advertisement
Dating.com
Chief Breakup Officer
Remote job
Ghosting culture
Relationship management
Breakup service salary

More Telugu News