- బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు వింత అనుభవం
- రూ.20 లక్షలకు సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ కారు కొన్న టెక్కీ
- భారీ వర్షంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన వాహనం
- రూ.61 లక్షల రిపేర్ బిల్లు
- టోటల్ లాస్‌గా ప్రకటించిన ఇన్సూరెన్స్ కంపెనీ
- లగ్జరీ కార్ల నిర్వహణ ఖర్చులపై చర్చకు దారితీసిన ఘటన
లగ్జరీ కార్లు కొంటే ఆ హోదానే వేరు. కానీ, వాటి నిర్వహణ, రిపేర్ల ఖర్చు తడిసి మోపెడవుతుందని చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమారు రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్ కారుకు యాక్సిడెంట్ అవ్వగా, అధికారిక సర్వీస్ సెంటర్ ఇచ్చిన రిపేర్ అంచనా బిల్లు చూసి కళ్లు తేలేశాడు. ఏకంగా రూ.61.7 లక్షలు బిల్లు వేయడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆడమ్ రిజ్క్ ఇటీవల తాను వాడిన మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా భారీ వర్షం పడింది. ఈ క్రమంలో హైవేపై వేగంగా వెళ్తుండగా, కారు అదుపుతప్పి (హైడ్రోప్లేనింగ్) డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపుకు దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో రిజ్క్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
అనంతరం, అతను కారును రిపేర్ కోసం మెర్సిడెస్ బెంజ్ అధికారిక సర్వీస్ సెంటర్‌కు తరలించాడు. కారును పరిశీలించిన సర్వీస్ సెంటర్ ప్రతినిధులు రిపేర్ కోసం వేసిన అంచనా బిల్లు చూసి రిజ్క్ నివ్వెరపోయాడు. విడిభాగాలకు రూ.47.77 లక్షలు, లేబర్ ఛార్జీలకు రూ.4.53 లక్షలు, జీఎస్టీ కింద రూ.9.41 లక్షలతో కలిపి మొత్తం బిల్లు రూ.61,70,077గా తేల్చారు. కేవలం విడిభాగాల జాబితానే 13 పేజీలు ఉండటం గమనార్హం. రిపేర్ ఖర్చు ఎక్కువగా ఉంటుందని ఊహించినా, కారు కొన్న ధర కంటే మూడు రెట్లు అధికంగా బిల్లు వస్తుందని అస్సలు ఊహించలేదని రిజ్క్ తన ఎక్స్ ఖాతాలో వాపోయాడు.
ఈ భారీ బిల్లుతో ఇన్సూరెన్స్ కంపెనీ కారును "టోటల్ లాస్" కింద ప్రకటించింది. అంటే, కారు విలువ కంటే రిపేర్ విలువే ఎక్కువగా ఉందని నిర్ధారించి, రిపేర్‌కు నిధులు ఇవ్వడానికి నిరాకరించింది. రిజ్క్ బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటంతో, అతనికి నష్టపరిహారంగా కేవలం రూ.16 లక్షలు మాత్రమే అందనుంది. ఈ ఘటన సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనేముందు వాటి నిర్వహణ, ప్రమాదానంతర ఖర్చుల గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.