- టోల్ ఎగవేతకు పాల్పడితే భారీ జరిమానా
- వాహన నంబర్ ప్లేట్ దాస్తే ఐదు రెట్లు పెనాల్టీ
- బ్యారియర్ రహిత టోల్ ప్లాజాల వద్ద కొత్త నిబంధనలు
- ఏఐ, వాహన్ డేటాబేస్‌తో ఎగవేతదారులను గుర్తించనున్న ఎన్హెచ్ఏఐ
- ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోతే 72 గంటల గడువు
జాతీయ రహదారులపై టోల్ ఫీజు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసినా లేదా కనిపించకుండా దాచిపెట్టినా, అసలు టోల్ మొత్తానికి ఐదు రెట్లు అదనంగా జరిమానా విధించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే.. చెల్లించాల్సిన టోల్ ఫీజుతో కలిపి మొత్తం ఆరు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, రూ. 100 టోల్ ఎగ్గొడితే.. రూ. 500 జరిమానాతో పాటు అసలు మొత్తం రూ. 100 కూడా కలిపి మొత్తం రూ. 600 కట్టాలి.
ఈ కొత్త నిబంధన బ్యారియర్లు లేని 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో' (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్ ప్లాజాల వద్ద వర్తిస్తుంది. టోల్ చెల్లింపును ఎగవేసే ఉద్దేశం స్పష్టంగా కనిపించిన సందర్భాల్లోనే ఈ పెనాల్టీ విధిస్తారు. వాహనం ముందు లేదా వెనుక నంబర్ ప్లేట్లను పాక్షికంగా లేదా పూర్తిగా కప్పివేయడం, ఫాస్టాగ్ ఉన్నప్పటికీ దానిని గుర్తించకుండా చేయడం వంటి చర్యలకు ఈ నిబంధన వర్తిస్తుంది. టోల్ చెల్లింపును తప్పించుకోవాలనే దురుద్దేశంతో ఫాస్టాగ్ అంటించని వారికి కూడా ఇదే జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ఉన్న ఎంఎల్ఎఫ్ఎఫ్ ప్లాజాలతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేసే అన్ని ప్లాజాలకూ ఇది వర్తిస్తుంది.
ఎగవేతదారులను ఎలా గుర్తిస్తారు?
ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు. ఓవర్ హెడ్ గ్యాంట్రీలపై అమర్చిన 'ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్' (ఏఎన్పీఆర్) కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్లు ఆటోమేటిక్‌గా టోల్ వసూలు చేస్తాయి. అయితే, నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ రెండూ కనిపించకపోతే ఎలా? దీనికోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 'వెహికల్ ఫింగర్‌ప్రింటింగ్' టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్ డేటాబేస్ అయిన 'వాహన్' సహాయంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను, వాటి యజమానులను సులభంగా గుర్తించనుంది.
ఇప్పటికే గుజరాత్‌లోని చోర్యాసి వద్ద దేశంలోనే తొలి బ్యారియర్-రహిత టోల్ ప్లాజా మే 1 నుంచి పనిచేస్తుండగా, ఢిల్లీలోని ముండ్కా ప్లాజాతో సహా మరో ఎనిమిది ప్రాంతాలకు ఈ వ్యవస్థను విస్తరించారు.
ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోతే?
ఫాస్టాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల టోల్ చెల్లింపు విఫలమైతే, దానిని ఉద్దేశపూర్వక ఎగవేతగా పరిగణించరు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, చెల్లించని టోల్ మొత్తం కోసం వాహన యజమానికి ఎలక్ట్రానిక్ నోటీసు (ఇ-నోటీస్) పంపుతారు. నోటీసు జారీ అయిన 72 గంటల్లోగా చెల్లిస్తే అసలు టోల్ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. ఆ గడువు దాటితే మాత్రం టోల్ మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.