- డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చే యోచనలో డీఎంకే పార్టీ
- స్టాలిన్ ప్రతిపాదించిన నిబంధనలకు కేంద్రం అంగీకారం
- లోక్‌సభలో డీఎంకేకు ఉన్న 22 మంది ఎంపీల బలం ఎంతో కీలకం
- రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా మారకుండా 50 శాతం సీట్ల పెంపు
- డీఎంకే మద్దతుపై మండిపడుతున్న అధికార టీవీకే పార్టీ
- బిల్లును వ్యతిరేకించాలంటూ డీఎంకేకు సీఎం విజయ్ సవాల్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మద్దతు ఇచ్చేందుకు సానుకూల సంకేతాలు ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. "మా నాయకుడు పట్టుబట్టిన అంశాలను కేంద్రం ఆమోదించింది.. అందుకే బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని సీనియర్ నేతలు స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే వైఖరి ఈ ఓటింగ్‌లో అత్యంత కీలకంగా మారింది. లోక్‌సభలో స్థానాలను 50 శాతం పెంచినప్పటికీ తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని స్టాలిన్ గతంలోనే డిమాండ్ చేశారు. అలాగే 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న సీట్ల విభజనను మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని కోరారు. సవరించిన ప్రతిపాదనలో రాష్ట్రాల నిష్పత్తి వాటా మారకుండా అందరికీ సమానంగా 50 శాతం సీట్లు పెంచేందుకు కేంద్రం సిద్ధపడటంతో డీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకపోతే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాల్సి వస్తుందని, సాధారణ మెజారిటీతోనే దాన్ని అమలు చేసే అవకాశం ఉందని బీజేపీ డీఎంకేకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తమిళనాడులోని అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) డీఎంకే తీరును తీవ్రంగా తప్పుబట్టింది. డీఎంకే తన ద్వంద్వ వైఖరిని వీడి, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించాలని సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సవాల్ విసిరింది. సభ నుంచి వాకౌట్ చేయడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటం బీజేపీకి లొంగిపోవడమేనని విమర్శించింది.