నటుడు ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల సీరే గట్టి.. ఉత్తరాది సెరువే దాటి’ అంటూ సాగే పాట శనివారం విడుదలైంది. అచ్చమైన తెలంగాణ కుటుంబ నేపథ్యంతో, పల్లెదనపు పరిమళాలు అద్దుకుని వచ్చిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సంప్రదాయ భావోద్వేగాలతో సాగే ఈ గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా అలరిస్తోంది.

వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 11న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో తాజా పాటతో చిత్ర యూనిట్ ప్రచార జోరును మరింత పెంచింది.
Play video