- షూటింగ్స్ తర్వాత ఇంటి వద్ద రొటీన్ పనులను పంచుకున్న రష్మిక
- వర్కవుట్ చేస్తూ పెంపుడు శునకంతో ఉన్న ఫొటోలు వైరల్
- విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఇటీవల జపాన్ టూర్
- తల్లిదండ్రుల విదేశీ పర్యటనలపై విజయ్ వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో రష్మిక వ్యక్తిగత వీడియోలకు భారీ స్పందన
షూటింగులు, కెమెరా వెలుగుల నుంచి దూరంగా ఇంట్లో ఉంటే తను ఎలా ఉంటుందో అభిమానులకు చూపిస్తూ హీరోయిన్ రష్మిక మందన్నా కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను పంచుకుంది. రోజంతా పని ముగించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత తాను ఏం చేస్తుందో తెలియజేసే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇది రష్మిక టీమ్.. పని పూర్తయ్యాక ఆమె ఇంటికి వెళ్తే ఇలాగే కనిపిస్తుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.
మొదటి చిత్రంలో రష్మిక వైట్ టీ-షర్ట్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్స్, పింక్ హెడ్‌బ్యాండ్‌తో నేలపై కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆ తర్వాత ఫొటోల్లో ఆమె ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తూ కనిపించగా, పెంపుడు శునకం ఆమె పక్కనే ఉండి సందడి చేసింది. ఎక్సర్‌సైజ్ మ్యాట్‌పై డంబెల్స్‌తో ట్రైనర్ సహాయంతో వర్కవుట్ చేస్తున్న దృశ్యాలు, రెడ్ ఫిట్‌నెస్ బాల్‌పై పడుకున్న సమయంలో పెంపుడు శునకం ఆమెకు ముద్దులు పెడుతున్న సరదా వీడియోలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇటీవలే రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ, అతని తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి జపాన్ వెళ్లి ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ ట్రిప్ ఫొటోలను పంచుకుంటూ ‘నా అభిమాన వ్యక్తులతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను’ అని విజయ్ రాసుకొచింది. అయితే ఓ షోలో పాల్గొన్నప్పుడు పెళ్లయ్యాక తన తల్లిదండ్రులను ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడమే తన ప్రాధాన్యమని విజయ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరిచారు. కేవలం విజయ్ తల్లిదండ్రుల గురించే కాకుండా, రష్మిక తల్లిదండ్రుల పట్ల కూడా సమాన బాధ్యత ఉండాలి కదా అంటూ కొందరు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.