- సముద్రంలో తప్పిపోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిక
- బోటు గేర్‌బాక్స్ పాడవడం వల్లే సముద్రంలో చిక్కుకుపోయినట్లు వెల్లడించిన బాధితులు
- వారం రోజులకు పైగా ఆచూకీ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు
సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కాకినాడ జిల్లా మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వారి బోటు ఉప్పాడ తీరానికి చేరుకోవడంతో దాదాపు వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో మత్స్యకార కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు 'ఇమ్మాన్యుయేల్' అనే బోటుపై నవంబర్ 4న వేటకు వెళ్లారు. నవంబర్ 10న విశాఖ హార్బర్‌కు చేరుకుని వేటను విక్రయించిన అనంతరం తిరిగి సముద్రంలోకి వెళ్లారు. అయితే నవంబర్ 15 నుంచి వీరి నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడం, బోటు ట్రాన్స్‌పాండర్ సిగ్నల్స్ కూడా నిలిచిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బాధితుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీంతో కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో బోటు యజమాని గిరికాన సింహాద్రితో పాటు సూరాడ చిన్న, మెరుగు నారాయణ, గంపల ప్రకాశ్, తిర్రి నారాయణ, కండల రాంబాబు, సూరాడ కొండలరావు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు.
బోటు గేర్‌బాక్స్ పాడవడం, మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో ఉండిపోవడం వల్లే తిరిగి రావడం ఆలస్యమైందని, తమ కోసం ప్రభుత్వం గాలింపు చేపట్టిన విషయం తమకు తెలియదని మత్స్యకారులు తెలిపారు. తీరానికి చేరిన వారిని కోస్ట్ గార్డ్, కాకినాడ జిల్లా అధికారులు కలిసి పరామర్శించారు. తమ వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.