- టీవీఎస్ కుటుంబ ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం కోర్టుకెక్కిన లక్ష్మీ వేణు
- 2024 నాటి కుటుంబ ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేసిన లక్ష్మి, తల్లి మల్లిక
- హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెలకు ఉన్న సమాన హక్కుల కోసం పోరాటం
- ట్రస్టుల ద్వారా ఉన్న ఆస్తుల విభజనలో నెలకొన్న న్యాయపరమైన సంక్లిష్టతలు
- కార్పొరేట్ కుటుంబాల్లో కుమార్తెల ఆస్తి హక్కులపై ఈ కేసుతో మళ్లీ చర్చ
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ గ్రూప్ కుటుంబంలో వారసత్వ ఆస్తుల వివాదం తలెత్తింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు, తమ కుటుంబ ఉమ్మడి ఆస్తులలో తనకు చట్ట ప్రకారం రావలసిన వాటాను విభజించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దావాతో దేశంలోని పెద్ద వ్యాపార కుటుంబాలలో కుమార్తెల ఆస్తి హక్కుల అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదానికి మూలం 2024లో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం వ్యాపార బాధ్యతలను మాత్రమే పంపిణీ చేశారని, కుటుంబ ఆస్తులలో తమ ఆర్థిక ప్రయోజనాలను మాత్రం పరిష్కరించలేదని లక్ష్మీ వేణు, ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ తమ పిటిషన్లో పేర్కొన్నారు.
అయితే, తన ఇద్దరు పిల్లలకు న్యాయం చేసేలాగే ఆ విభజన జరిగిందని వేణు శ్రీనివాసన్ వాదిస్తున్నారు. టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ వంటి సంస్థలలోని వాటాలను 'వీఎస్ ట్రస్ట్' సహా ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా నిర్వహిస్తున్నారు.
లక్ష్మీ వేణు తన వాదనకు హిందూ వారసత్వ చట్టం-1956ను ఆధారంగా చేసుకున్నారు. 2005లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం, హిందూ మితాక్షర ఉమ్మడి కుటుంబంలో కొడుకులతో సమానంగా కుమార్తెలకు కూడా పిత్రార్జితంలో పుట్టుకతోనే సమాన హక్కులు (సహదాయాదులు) లభిస్తాయి. ఆస్తి విభజనను కోరే హక్కు వారికి ఉంటుంది. ఈ సవరణ అమల్లోకి వచ్చినప్పుడు తండ్రి జీవించి ఉన్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా కుమార్తెలకు ఈ హక్కు వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.
అయితే, ఈ కేసులో కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. న్యాయ నిపుణుల ప్రకారం, పిత్రార్జితం, స్వార్జితం మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంటుంది. పిత్రార్జితాన్ని చట్ట ప్రకారం విభజించాల్సి ఉండగా, తండ్రి తన స్వార్జితాన్ని తన ఇష్టానుసారం ఎవరికైనా రాసివ్వొచ్చు.
టీవీఎస్ ఆస్తులు ఎక్కువగా ఫ్యామిలీ ట్రస్టుల కింద ఉండటంతో వాటి చట్టపరమైన యాజమాన్యం ట్రస్టుకే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సాధారణ భాగాల పంపకాల దావా వేయడం సంక్లిష్టంగా మారుతుంది. వ్యాపార నిర్వహణ నియంత్రణ వేరు, ఆస్తులపై యాజమాన్యం వేరు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒకసారి కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరితే అది అందరికీ వర్తిస్తుంది. అయితే, మోసం, బలవంతం వంటి కారణాలతో దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ కేసులో 2024లో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒక ఒప్పందం చెల్లుబాటు, లక్ష్మీ వేణు ఆర్థిక హక్కులు పరిష్కారమయ్యాయా? లేదా? అనే అంశాలను కోర్టు పరిశీలించనుంది. ఈ కేసులో వెలువడే తీర్పు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాపార కుటుంబాల్లో తలెత్తే వారసత్వ వివాదాలకు మార్గనిర్దేశంగా నిలిచే అవకాశం ఉంది.