- కేవలం 130 మంది విద్యార్థులకు 45 కంపెనీల నుంచి 200కు పైగా ఆఫర్లు
- రెండు నెలల ఇంటర్న్షిప్కుగానూ అత్యధికంగా రూ.7.9 లక్షల స్టైపెండ్
- యాక్సెంచర్ (29), ఈవై (17) సంస్థల నుంచి భారీగా ఆఫర్లు
- గూగుల్, మెకిన్సీ, టాటా, అదానీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యం
- విద్యార్థులకు సగటున లభించిన రూ.3.44 లక్షల భారీ స్టైపెండ్
ప్రముఖ వ్యాపార విద్యా సంస్థ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్‌బీ).. పీజీపీ వైఎల్ విభాగంలో ఈ ఏడాది కూడా సంచలన రికార్డులు సృష్టించింది. కేవలం 130 మంది విద్యార్థులతో కూడిన రెండో బ్యాచ్ (2026-28) వేసవి ఇంటర్న్‌షిప్స్‌లో ఏకంగా 200లకు పైగా ఆఫర్లను దక్కించుకుంది. గూగుల్, మెకిన్సీ, బెయిన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీ స్టైపెండ్లతో ఈ ఇంటర్న్‌షిప్స్ ఆఫర్ చేశాయి. రెండు నెలల ఇంటర్న్‌షిప్ కాలానికి గానూ సగటు స్టైపెండ్ రూ. 3.44 లక్షలుగా నమోదు కాగా.. అత్యధికంగా ఒక విద్యార్థికి రూ.7.9 లక్షల ఆఫర్ లభించడం విశేషం.
దిగ్గజ సంస్థల పోటీ
కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఫైనాన్స్ వంటి రంగాలకు చెందిన 45కి పైగా అగ్రశ్రేణి కంపెనీలు ఈ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నాయి. కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగాల నుంచి అత్యధికంగా 117 ఆఫర్లు వచ్చాయి. ఇందులో యాక్సెంచర్ అత్యధికంగా 29 ఆఫర్లతో ముందుండగా.. ఈవై-పార్థెనాన్ (17), డెలాయిట్ (9), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (8), మాస్టర్ కార్డ్ (8) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మెకిన్సీ, బెయిన్ & కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.
అన్ని రంగాల్లోనూ డిమాండ్
టెక్నాలజీ విభాగం నుంచి 27 ఆఫర్లు రాగా.. 'పర్పుల్' అత్యధికంగా 6 ఆఫర్లతో అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్, స్విగ్గీ, శామ్‌సంగ్, ఫిలిప్స్ వంటి ప్రముఖ కంపెనీలు తలో 5 ఆఫర్లను అందించాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో హెచ్‌యూఎల్, డాబర్ సంస్థలు చెరో 6 ఆఫర్లతో సత్తా చాటాయి. అటు దిగ్గజ పారిశ్రామిక గ్రూపుల విభాగంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ (6), టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (4) సహా ఆదిత్య బిర్లా, గోద్రెజ్ గ్రూపులు 16 ఆఫర్లు ఇచ్చాయి. యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, కమ్మిన్స్ వంటి మరికొన్ని అగ్రశ్రేణి సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్స్ అందించాయి.
పరిశ్రమలకు అవసరమైన నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం వల్లే ఈ అసాధారణ విజయాలు సాధ్యమయ్యాయని ఐఎస్‌బీ అసిస్టెంట్ డీన్ ప్రొఫెసర్ ప్రణవ్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం 9 నెలల లోపు ముందస్తు పని అనుభవం ఉన్న యువ వృత్తి నిపుణుల కోసం రూపొందించిన ఈ 20 నెలల ప్రత్యేక కోర్సు మార్కెట్‌లో అద్భుతమైన ఆదరణ పొందుతోందని స్పష్టం చేశారు.