- విద్యుత్ వాడే సమయాన్ని బట్టి బిల్లు మారే సరికొత్త విధానం
- సామాన్య గృహ వినియోగదారులకు 2029 ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్
- రైతులకు ఊరట కల్పిస్తూ వ్యవసాయ రంగానికి పూర్తి మినహాయింపు
- కార్పొరేషన్లలో దరఖాస్తు చేసిన 3 రోజుల్లోనే కొత్త కరెంట్ కనెక్షన్
- సగటు కంటే 5 రెట్లు ఎక్కువ బిల్లు వస్తే ఆటోమేటిక్గా తనిఖీ
ఇంట్లో ఏసీ, వాషింగ్ మెషీన్, గీజర్ వంటివి ఎప్పుడు పడితే అప్పుడు వాడుతున్నారా? ఇకపై అలా చేస్తే కరెంట్ బిల్లు తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది. ఒకే పరిమాణంలో విద్యుత్ వాడినా, వాడే సమయాన్ని బట్టి వేర్వేరు బిల్లులు చెల్లించాల్సి వచ్చే సరికొత్త విధానానికి కేంద్ర విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండే వేళల్లో అధిక ధరలు, డిమాండ్ తక్కువగా ఉండే సమయాల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేసే ‘టైమ్ ఆఫ్ డే’ టారిఫ్ ముసాయిదా నిబంధనలను కేంద్రం ప్రతిపాదించింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తొలుత 10 కిలోవాట్లకు పైగా డిమాండ్ ఉన్న కస్టమర్లకు 2028 ఏప్రిల్ 1 నాటికి ఈ విధానం వర్తిస్తుంది. ఆ తర్వాత సామాన్య గృహ వినియోగదారులకు 2029 ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలవుతుంది. అయితే, రైతులకు ఊరటనిస్తూ వ్యవసాయ రంగానికి దీని నుంచి మినహాయింపు కల్పించారు. రాష్ట్రాల్లోని డిమాండ్, పునరుత్పాదక ఇంధన లభ్యత, పవర్ ఎక్స్ఛేంజ్ ధరలను బట్టి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు వివిధ సమయాల స్లాట్లను, వాటి రేట్లను ఖరారు చేస్తాయి.
సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాన్ని సొంతంగా ఉత్పత్తి చేసే 10 కిలోవాట్లకు పైబడిన కస్టమర్లు.. రోజువారీ ఉత్పత్తిలో కనీసం 20 శాతం నిల్వ చేసేలా స్టోరేజీ బ్యాటరీలను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఈ నిబంధన 2028 ఏప్రిల్ నుంచి అమలు కానుంది.
కొత్త కనెక్షన్ల మంజూరుకు కూడా గడువులు విధించారు. మెట్రోపాలిటన్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే కొత్త కనెక్షన్ ఇవ్వాలి. ఇతర పురపాలక సంఘాల్లో 7 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజులు, కొండ ప్రాంతాల్లో 30 రోజుల గడువు నిర్దేశించారు. లైన్లు వేయడం, సబ్స్టేషన్ల నిర్మాణం వంటి పనులుంటే 90 రోజుల సమయం పడుతుంది.
విద్యుత్ బిల్లుల అక్రమాలను అరికట్టేందుకు ముసాయిదాలో కీలక రక్షణలు చేర్చారు. గత ఆరు నెలల సగటు కంటే బిల్లు 5 రెట్లు అధికంగా వచ్చినా, లేదా అయిదో వంతు కంటే తక్కువగా నమోదైనా బిల్లింగ్ సిస్టమ్ దాన్ని అనుమానాస్పదంగా గుర్తించాలి. అలా గుర్తించిన కేసులను అధికారులు 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ లోపు సదరు సమస్య తేలే వరకు కస్టమర్లు తమ గత ఆరు నెలల సగటు బిల్లును చెల్లించి విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూసుకోవచ్చు.