- ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన
- బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందుగానీ, పుట్టిన 6 నెలల్లోపుగానీ సెలవు
- కుటుంబ బాధ్యతల్లో తండ్రుల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యం
- మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఏడాది ప్రసూతి సెలవులు
తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పురుష ఉద్యోగుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న వివాహిత పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులను (Paternity Leave) మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పురుషులకు ఇలాంటి సౌకర్యం కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ సెలవును తమకు అనుకూలమైన సమయంలో తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందుగానీ, లేదా బిడ్డ పుట్టిన నాటి నుంచి ఆరు నెలల లోపుగానీ ఈ సెలవును వినియోగించుకోవచ్చని ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బిడ్డ పుట్టిన తొలిదశలో సంరక్షణ బాధ్యతలను తండ్రులు కూడా పంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. పురుష ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా, తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 365 రోజుల ప్రసూతి సెలవులు అమలవుతున్న విషయం తెలిసిందే.