- మహబూబాబాద్ గిరిజన హాస్టల్లో ఘటన
- బాత్రూంలో జన్మించిన శిశువు మృతి
- అస్వస్థతకు గురైన విద్యార్థినికి ఆసుపత్రిలో చికిత్స
- గర్భవతి అనే విషయాన్ని దాచిపెట్టిన విద్యార్థిని
- ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గిరిజన బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని బాత్రూంలో ప్రసవించగా, అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందాడు. ప్రస్తుతం విద్యార్థిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ యువతి, మహబూబాబాద్‌లోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో చేరింది. అయితే, జులై 15న కళాశాలలో చేరేనాటికే ఆమె గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు గానీ, కళాశాల సిబ్బందికి గానీ తెలియకుండా గోప్యంగా ఉంచింది.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కడుపునొప్పిగా ఉందని చెప్పి బాత్రూంకు వెళ్లిన విద్యార్థిని, అక్కడే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను, శిశువును మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శిశువు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మహబూబాబాద్ పోలీసులు తెలిపారు.