- ఆలిస్ హువాంగ్ అనే మహిళ గూఢచారి అనడానికి ఆధారాల్లేవన్న యూఎస్ నిఘా వర్గాలు
- చైనా స్పై ఏజెన్సీ ఆమెను సంప్రదించినా, కీలక సమాచారం ఇవ్వలేదని వెల్లడి
- ఆమె భర్త చైనా నిఘా ఏజెంట్ అని తేలినప్పటికీ కుట్ర కోణం కనిపించలేదని స్పష్టీకరణ
- అక్రమ చిప్‌ల తరలింపు, వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు కొనసాగింపు
ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌ల మధ్య ఉన్న సంబంధం గూఢచర్యం కాదని, అది కేవలం రొమాంటిక్ రిలేషన్ మాత్రమేనని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో పేర్కొంది. జెన్సన్ హువాంగ్ లేదా ఆయన సంస్థపై గూఢచర్యం చేయడానికి చైనా నిఘా సంస్థలు ఆలిస్‌ను పంపాయనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది.
అమెరికా నిఘా అధికారులు కాంగ్రెస్ సిబ్బందికి ఇచ్చిన బ్రీఫింగ్‌లో ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం. చైనా చట్టాల ప్రకారం, ఆ దేశ ప్రధాన గూఢచర్య సంస్థ 'మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ' (ఎంఎస్ఎస్), సమాచారం కోసం ఆలిస్ హువాంగ్‌ను సంప్రదించిన మాట వాస్తవమేనని అధికారులు తెలిపారు. దీంతో ఆమె ఎఫైర్ సమయంలో ఎంఎస్ఎస్ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నారు. అయితే, ఆమె ఎలాంటి కీలకమైన సమాచారాన్ని చైనాకు అందించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు, ఆలిస్ భర్తగా చెప్పబడుతున్న కంగ్ వీ, ఎంఎస్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు కూడా ఈ బ్రీఫింగ్‌లో చర్చకు వచ్చింది.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, జెన్సన్ హువాంగ్‌పై చైనా గూఢచర్య కుట్ర జరిగిందనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. అయితే, ప్రస్తుత ఆధారాలు ఈ వాదనను బలపరచడం లేదు. కొందరు అమెరికన్ అధికారులు మాత్రం, చైనా నిఘా సంస్థతో సంబంధాలు కలిగి ఉండటమే గూఢచర్యంతో సమానమని వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించి చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా తరలించడంలో ఈ వ్యవహారం ఏమైనా ప్రభావం చూపిందా అనే కోణంలో యూఎస్ ఏజెన్సీలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఎన్విడియా బోర్డు కూడా ఈ అంశంపై అంతర్గత విచారణ జరుపుతోంది. 'రాయిటర్స్' నివేదిక ప్రకారం, ఆలిస్ హువాంగ్‌కు చెందిన కంపెనీలు చైనాలోని భారీ ఏఐ డేటా సెంటర్ల కోసం శక్తివంతమైన కంప్యూటింగ్ పరికరాలను అడ్డం పెట్టుకుని సుమారు 270 మిలియన్ డాలర్లు (రూ.2,498కోట్లు) నిధులను సమీకరించాయి.
ఈ నేపథ్యంలో ఆలిస్‌కు చెందిన సింగపూర్ కంపెనీ 'మెగాస్పీడ్'ను అమెరికా వాణిజ్య శాఖ సోమవారం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అయితే, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆలిస్ హువాంగ్ 2025 ఆగస్టులోనే కంపెనీ నుంచి వైదొలిగారని మెగాస్పీడ్ ప్రకటించింది. మొత్తం మీద, ఈ వ్యవహారం గూఢచర్యం కాకపోయినా, చైనాకు టెక్నాలజీ తరలింపునకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.