- నిర్మల్ జిల్లా బాసర రవీంద్రపూర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం
- కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు దగ్ధం
- మంటల్లో కాలి బూడిదైన నాలుగు తులాల బంగారం
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ
- మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
ఆడబిడ్డ పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని ఆ పేద తల్లిదండ్రులు కలలు కన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ము, చేయించిన బంగారు నగలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఒక్క ప్రమాదం ఆ కుటుంబం కళ్లముందే వాళ్ల స్వప్నాలను బూడిద చేసింది. షార్ట్ సర్క్యూట్ రూపంలో వచ్చిన మంటలు ఆ పేదింటి భవిష్యత్తును అగ్నికి ఆహుతి చేశాయి.
నిర్మల్ జిల్లా బాసర పరిధిలోని రవీంద్రపూర్ కాలనీలో షేక్ ఇబ్రహీం నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించి తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి.
కూతురి పెళ్లి కోసం ఇబ్రహీం కుటుంబం ఎంతో కష్టపడి దాచిన దాదాపు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం ఈ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.