- ఖమ్మం జిల్లాలో తల్లి, కొడుకు ఆత్మహత్య
- భర్త మరణంతో డిప్రెషన్‌కు గురై ఈ దారుణానికి పాల్పడిన మహిళ
- బాదం పాలలో ఎలుకల మందు కలిపి పిల్లలకు ఇచ్చి, తానూ తాగిన వైనం
- చికిత్స పొందుతూ తల్లి, చిన్న కొడుకు మృతి.. పెద్ద కొడుకు పరిస్థితి విషమం
- బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, ఆమె చిన్న కుమారుడు మృతి చెందగా, పెద్ద కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కోనిజెర్ల మండలం లాలాపురం గ్రామానికి చెందిన రంజాన్ బీ (29) భర్త ఇటీవల మరణించాడు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 19న బాదం పాలలో ఎలుకల మందు కలిపి తన కుమారులు నిస్సానొద్దీన్ (8), నహీమ్ (6)లకు ఇచ్చింది. అనంతరం ఆమె కూడా ఆ పాలను తాగింది.
రెండు రోజుల తర్వాత పిల్లలకు వాంతులు మొదలయ్యాయి. రంజాన్ బీ ఆరోగ్యం కూడా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం పిల్లలను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం చిన్న కుమారుడు నహీమ్, అదే రోజు రాత్రి ఖమ్మం ఆసుపత్రిలో రంజాన్ బీ మృతి చెందారు. పెద్ద కుమారుడు నిస్సానొద్దీన్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతురాలి బంధువు షేక్ షైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.