- గంపలగూడెం ఫారెస్ట్‌లో తిష్టవేసిన పులి
- పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రంగంలోకి దిగిన పూణే నిపుణుల బృందం
- రెండు రోజులుగా అందకుండా పోయిన జీపీఎస్ ట్రాకర్ సిగ్నల్స్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ ఐదో రోజుకు చేరింది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు అడవి నలువైపులా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
'ఎక్స్‌ప్లోరర్'గా పిలిచే ఈ పెద్దపులికి కనుమూరు ఫారెస్ట్‌లో ఆహారం, నీరు సమృద్ధిగా లభించడంతో పాటు అనువైన వాతావరణం ఉండటంతో ఇక్కడే తిష్టవేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ నుంచి సంకేతాలు స్పష్టంగా అందడం లేదు. పులి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లడం వల్లే సిగ్నల్స్ సరిగా రావడం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాకర్ సిగ్నల్స్ అందకపోయినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అటవీ ప్రాంతం చుట్టూ పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు.
పులిని బంధించేందుకు మహారాష్ట్రలోని పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. అటవీ ప్రాంతంలో ఇప్పటికే 2 బోన్లు ఏర్పాటు చేశారు. పులికి ఎటువంటి హాని కలగకుండా ట్రాంక్విలైజర్ గన్ ద్వారా మత్తు ఇచ్చి పట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పులి సంచారం నేపథ్యంలో కనుమూరు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఒంటరిగా పొలాల వైపు, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే గుంపులుగా టార్చ్ లైట్లతో వెళ్లాలని, పశువులను అడవికి దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. పులిని బంధించే వరకు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.