- రామోజీరావు జయంతిని అధికారికంగా నిర్వహించడంపై లక్ష్మీపార్వతి ఆగ్రహం
- ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో రామోజీ, బాబు కుమ్మక్కయ్యారని ఆరోపణ
- ముందు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించి, అవార్డులను పునరుద్ధరించాలని డిమాండ్
- మార్గదర్శి వివాదాలను ప్రస్తావిస్తూ రామోజీ అర్హతను ప్రశ్నించిన లక్ష్మీపార్వతి
మీడియా అధినేత రామోజీరావు జయంతిని అధికారికంగా రాష్ట్ర వేడుకగా ప్రకటించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను రాజకీయంగా గద్దె దించడానికి సహాయపడిన వ్యక్తికి ఇంతటి గౌరవం ఎందుకని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైజాగ్‌లోని డాల్ఫిన్ హోటల్లో సమావేశమై, వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ సమయంలో తప్పుడు ప్రచారంతో ఎన్టీఆర్‌ను చంద్రబాబు, రామోజీరావు ఇద్దరూ కలిసి కూల్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా విస్మరించి, రామోజీరావు స్మారక కార్యక్రమానికి ప్రజాధనం రూ.10 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. చంద్రబాబు ముందు తన మామ ఎన్టీఆర్‌ను గౌరవించాలని, ఆయన పేరు మీద నిర్లక్ష్యం చేయబడిన అవార్డులను పునరుద్ధరించాలని, ఆయనకు భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే, చంద్రబాబు మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని గుర్తుచేశారు.
మార్గదర్శి ఆర్థిక వివాదాలు, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకల ఆరోపణలను ప్రస్తావిస్తూ.. రామోజీరావు ప్రజలకు ఆదర్శప్రాయుడని ఎలా చెబుతారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అక్రమ పద్ధతుల్లో సంపద ఎలా కూడబెట్టచ్చన్నది ‘ధనవద్గీత’గా ఆయన తెలియజేశారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకించిన రామోజీ మీడియా, తాము మాత్రం ఇంగ్లీష్ మీడియం సంస్థలను నడుపుతోందని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో మద్య నిషేధానికి ప్రచారం చేసి, చంద్రబాబు హయాంలో దాన్ని ఎత్తివేయడాన్ని సమర్థించారని ఎండగట్టారు.
వివాదాస్పద రాజకీయ ప్రవర్తన కలిగిన వ్యక్తిని గౌరవించడానికి ప్రజాధనాన్ని ఎందుకు వెచ్చించాల్సి వస్తోందని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. రామోజీరావును కీర్తించే ముందు, ఎన్టీఆర్ సేవలను గుర్తించి ఆయనకు దక్కాల్సిన గౌరవం ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గంజాయి మాఫియా పెరిగింది: వైసీపీ
ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం గంజాయి మాఫియాను పెంచి పోషిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి ఆరోపించారు. హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేశ్, అనిత 30 నెలల్లో ఏం సాధించారని ప్రశ్నించారు. కళాశాలలు, పాఠశాలలు, మహిళా హాస్టళ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్ల చుట్టూ మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, మహిళలపై దాడులు, హత్యలకు ఇవే కారణమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.