- అసెంబ్లీలో నూతన చట్టం ఆమోదించిన కేరళం ప్రభుత్వం
- వృద్ధుల కోసం ప్రత్యేక శాఖను తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళం
- గవర్నర్ ఆమోదం రాగానే నిబంధనలు పక్కాగా అమలు
- పతనపురంలో రూ.20 కోట్లతో వృద్ధుల కోసం ‘పితృమందిరం’
- భవన నిర్మాణానికి నిధులు అందించిన లులు గ్రూప్ అధినేత
తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని, ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా గాలికొదిలేసే పిల్లలకు కేరళం ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. అలాంటి బాధ్యతారహిత సంతానానికి ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేరళం ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ సంచలన ప్రకటన చేశారు. సీనియర్ సిటిజన్ల సంరక్షణ, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్లో ఆమోదించిన నూతన బిల్లులో ఈ కీలక నిబంధనను చేర్చినట్లు స్పష్టం చేశారు. కొల్లం సమీపంలోని పతనపురంలో గల గాంధీభవన్లో రూ.20 కోట్ల వ్యయంతో వృద్ధుల కోసం అత్యాధునిక వసతులతో నిర్మించిన 'పితృమందిరం' నివాస సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు.
యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న తొలి నిర్ణయం వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడమేనని సీఎం గుర్తుచేశారు. దేశంలోనే ఇలాంటి శాఖను నెలకొల్పిన తొలి రాష్ట్రం కేరళం అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వయోవృద్ధులకు పలు విశేష హక్కులను కల్పిస్తూ సమగ్ర చట్టాన్ని తెచ్చామని వివరించారు. గవర్నర్ ఆమోదం లభించి ఈ చట్టం పూర్తిస్థాయిలో అమల్లోకి రాగానే, తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలను కచ్చితంగా జైలుకు పంపుతామని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని గట్టిగా చెప్పారు.
పిల్లలను పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు ఎంతటి కష్టాలు, త్యాగాలు భరిస్తారో సమాజం తెలుసుకోవాలని సతీశన్ ఉద్వేగంగా మాట్లాడారు. ఎదిగి పెద్ద స్థాయికి చేరిన తర్వాత కన్నవారిని అనాథలుగా వదిలేసే సంస్కృతి కేరళంలో ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను గుండెలకు హత్తుకుని చూసుకునే సరికొత్త సంస్కృతి సమాజంలో రావాలని, రాష్ట్రంలో ఏ ఒక్క వృద్ధుడూ ఒంటరి కాకూడదన్నదే తన ఆశయమని తెలిపారు. కాగా, ఈ పితృమందిరం నిర్మాణానికి పూర్తి ఆర్థిక సాయం అందించిన లులు గ్రూప్ ఛైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీని సీఎం కొనియాడారు. ఎంత సంపద ఉన్నా ఇతరులకు సాయం చేసే గొప్ప గుణం ఆయనకు ఉందని ప్రశంసించారు.