- ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్న మంత్రి
- కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి గాంధీ భవన్‌కు వచ్చిన బీఎం సందీప్
- మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మలతో ఇన్చార్జి విడివిడి సమావేశాలు
- రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం
- ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యవహారంపై నేతల ఆరా
కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ప్రభుత్వ పాలనపై ప్రజల్లోనూ ఎలాంటి వ్యతిరేకత లేదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన బీఎం సందీప్.. గాంధీ భవన్‌కు వచ్చిన సందర్భంగా మంత్రులు ఆయనతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇన్‌చార్జితో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి తొలిసారి వచ్చిన సందీప్‌ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, పార్టీ బలోపేతంపైనే చర్చించామని, ఎలాంటి అంతర్గత విషయాలు చర్చకు రాలేదని చెప్పారు.
మరోవైపు గాంధీ భవన్‌లో కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ వరుస సమీక్షలతో బిజీగా గడిపారు. పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచే లక్ష్యంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో ఆయన విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పరిపాలన అంశాలపై మంత్రుల నుంచి వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని సందీప్ దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో పార్టీ స్థితిగతులు, నాయకుల మధ్య సఖ్యతపై దృష్టి సారించారు. ఇటీవల పార్టీలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిల వివాదంపై డీసీసీ అధ్యక్షులు ఇన్‌చార్జికి ఫిర్యాదు చేసే అవకాశమున్నట్లు సమాచారం. డీసీసీ అధ్యక్షులతో పాటు సాయంత్రం పీసీసీ ముఖ్య నేతలు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులతోనూ సందీప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.