- స్ప్లెండర్ ప్లస్ ధరలు రూ. 3,086 వరకు పెంపు
- స్పెషల్ ఎడిషన్స్‌లో 3 సరికొత్త కలర్ ఆప్షన్లు
- గరిష్ఠంగా స్పెషల్ ఎడిషన్పైనే రూ.3,086 పెరుగుదల
- బేస్ డ్రమ్, ఐ3ఎస్ వేరియంట్లపై రూ. 1,135 పెంపు
- స్ప్లెండర్ ఫ్లెక్స్ ధర రూ. 1,332 పైకి
భారతదేశంలో 100సీసీ కమ్యూటర్ బైక్‌లలో తిరుగులేని ఆదరణ కలిగిన ‘హీరో స్ప్లెండర్ ప్లస్’ ధరలను దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ పెంచింది. స్ప్లెండర్ మార్కెట్లోకి వచ్చి 32 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం లభిస్తున్న నాలుగు వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 3,086 వరకు ధరలు పెరిగాయి.
కంపెనీ గతంలో అందించిన ‘బ్లాక్ అండ్ యాక్సెంట్’ మోడల్‌ను ఇప్పుడు ‘స్పెషల్ ఎడిషన్స్’గా రీబ్రాండ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే మూడు సరికొత్త రంగులను పరిచయం చేశారు. కాగా ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పైనే అత్యధికంగా రూ. 3,086 పెరగడంతో దీని ధర రూ. 81,666కు చేరింది. బేస్ డ్రమ్ వేరియంట్, ఐ3ఎస్, 125 మిలియన్ ఎడిషన్లపై రూ. 1,135 చొప్పున ధరలు పెరిగాయి.
మరోవైపు సరికొత్త సాంకేతికతతో వచ్చిన ‘ఎక్స్‌టెక్ 2.0’ వేరియంట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఇండికేటర్లకు హజార్డ్ లైట్ల ఫీచర్లను జోడించినప్పటికీ, ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సదుపాయం ఇవ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ముందు వైపు డిస్క్ బ్రేక్ సదుపాయం కేవలం సాధారణ ఎక్స్‌టెక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది (ధర రూ. 85,461). ఫ్లెక్స్-ఇంధన ఇంజిన్‌తో వచ్చిన స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ వేరియంట్ ధర కూడా రూ. 1,332 పెరిగి రూ. 84,042కు చేరింది.