- హాల్‌మార్కింగ్ వ్యవస్థలో భారీ అక్రమాలపై దుమారం
- చైనా రీనియం పొడితో పసిడి కల్తీ ఆరోపణలు
- సాధారణ హాల్‌మార్క్ పరీక్షల్లో దొరకని రసాయన కల్తీ
- దేశంలో 4,000 అనధికారిక గోల్డ్ రిఫైనరీల దందా
- బీఐఎస్ కేర్ యాప్ డేటాలో కనిపించిన తేడాలు
- నవంబరు 23న బీఐఎస్ అత్యవసర సమీక్షా సమావేశం
బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పసిడి స్వచ్ఛతకు ప్రామాణికంగా భావించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్‌మార్కింగ్ వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్, రిఫైనింగ్ ప్రక్రియల్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తినట్లు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం వెల్లడించింది.
కొందరు నగల వ్యాపారులు, హాల్‌మార్కింగ్ కేంద్రాల మధ్య కుమ్మక్కు నడుస్తోందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అనుమానం వ్యక్తం చేసింది. నకిలీ స్వచ్ఛత నివేదికలు తయారు చేయడం, ఫీజుల రూపంలో ముడుపులు తీసుకోవడం మాత్రమే కాకుండా, బంగారం బరువును పెంచేందుకు చైనా నుంచి తెప్పిస్తున్న 'రీనియం' అనే రసాయన పొడిని కలిపి కల్తీ చేస్తున్నారని ఐబీజేఏ ఆరోపించింది. రీనియం ద్రవీభవన స్థాయి 3,100 డిగ్రీల సెల్సియస్ కాగా, సాధారణంగా ఆభరణాల తయారీలో ఉపయోగించే 1,050 నుంచి 1,100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అది బంగారంలో కరగదు. దీనివల్ల సాధారణ హాల్‌మార్కింగ్ పరీక్షల్లో కూడా ఈ కల్తీ బయటపడటం లేదని ఆందోళన చెందుతున్నారు.
దేశంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని సుమారు 4,000 అనధికార గోల్డ్ రిఫైనరీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. దొంగ నోట్ల చలామణి తరహాలోనే ఈ ముఠాలు స్వచ్ఛత లేని పసిడిని కడ్డీలు, నాణేలు, నగల రూపంలో మార్కెట్లోకి వదులుతున్నాయని చెప్పారు. బిఐఎస్ కేర్ యాప్‌లోని హెచ్‌యూఐడీ డేటాలో సైతం తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఐఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో చర్చించేందుకు బీఐఎస్ నవంబరు 23న అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.