- కావేరి అంశంపై ఢిల్లీలో విజయ్ ఎందుకు మాట్లాడలేదు: బీజేపీ నేత తమిళిసై
- తిరుప్పరంకుండ్రం దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదని వ్యాఖ్య
- డీఎంకే, టీవీకే రెండింటికీ బీజేపీ వ్యతిరేకమేనని స్పష్టీకరణ
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ... కాంగ్రెస్తో ఉన్న పొత్తుపై పునరాలోచన చేయాలని బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బీడియాతో ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై పలు విమర్శలు చేశారు.
ఢిల్లీలో ఇటీవల జరిగిన సోనియా గాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్... అక్కడే ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎదుట కావేరి జలాల సమస్యను లేవనెత్తకపోవడం సరికాదని తమిళిసై అభిప్రాయపడ్డారు. మేకెదాటు డ్యామ్ నిర్మాణంపై కర్ణాటక తీసుకుంటున్న వైఖరిని నిరసిస్తూ ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించి ఉండాల్సిందని ఆమె సూచించారు. కాంగ్రెస్ వైఖరిపై చరిత్రను దృష్టిలో పెట్టుకుని, వారితో పొత్తు అంశాన్ని టీవీకే పార్టీ సమీక్షించుకోవాలని ఆమె అన్నారు.
అదేవిధంగా, తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తమిళిసై ఆక్షేపించారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆరు నెలల టీవీకే ప్రభుత్వ పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని విమర్శించిన ఆమె... తమిళనాడులో డీఎంకే, టీవీకే రెండు పార్టీలనూ బీజేపీ రాజకీయంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ లేకపోతే విజయ్ సీఎం అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు.