- నర్మదా నదిలో పర్యాటకులకు సరికొత్త అనుభూతి
- ఒకేసారి 600 మంది ప్రయాణించేలా క్రూయిజ్ రూపకల్పన
- డీజే, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక డిన్నర్ క్రూయిజ్
- క్రూయిజ్ ప్రయాణంపై పర్యాటకుల హర్షం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని సందర్శించే పర్యాటకుల కోసం గుజరాత్ ప్రభుత్వం మరో సరికొత్త అనుభూతిని అందుబాటులోకి తీసుకువచ్చింది. నర్మదా నదిపై 'ఏక్తా క్రూయిజ్' పేరుతో వినూత్న నౌకా విహార సేవలను ప్రారంభించింది. ఈ క్రూయిజ్ ద్వారా పర్యాటకులు నదిలో ప్రయాణిస్తూ పటేల్ విగ్రహాన్ని, పరిసరాల్లోని ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
గుజరాత్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ క్రూయిజ్‌లో ఒకేసారి సుమారు 600 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. శ్రేష్ఠ్ భారత్ భవన్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ క్రూయిజ్ ప్రతిరోజూ ఐదు ట్రిప్పులు నడుస్తుంది. ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన సీటింగ్, డైనింగ్ సదుపాయాలతో పాటు విగ్రహాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
ఈ క్రూయిజ్ విశేషాల గురించి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అదనపు కలెక్టర్ నిరవ్ పరితోష్ మాట్లాడుతూ "ఒకేసారి 500 మందికి పైగా పర్యాటకులు రివర్ టూరిజాన్ని ఆస్వాదించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయి. లైవ్ మ్యూజిక్, డిన్నర్‌తో కూడిన ప్రత్యేక ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది" అని వివరించారు.
ఏక్తా క్రూయిజ్‌లో ప్రయాణించిన పర్యాటకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.16 కోట్ల వ్యయంతో ఈ క్రూయిజ్‌ను అభివృద్ధి చేశారు. సాయంత్రం వేళల్లో డీజే, డ్యాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేక డిన్నర్ క్రూయిజ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద పర్యాటక మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏక్తా క్రూయిజ్‌ను ప్రారంభించారు.