- అమెరికా ఫ్యాషన్ సంస్థ ప్యాక్‌సన్ వ్యాపార నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం
- 13-22 ఏళ్ల వయసున్న 15 మందితో యూత్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు
- ప్రస్తుతం సుమారు 300 మంది యువత అంబాసిడర్లుగా సంస్థకు సూచనలు
- స్టోర్ల నిర్వహణ, డిజైన్, మార్కెటింగ్, కొత్త ట్రెండ్స్‌పై పరిగణనలోకి వారి అభిప్రాయాలు
- గత ఏడాది సంస్థ 970 మిలియన్ డాలర్ల అమ్మకాల నమోదు
ఒక ఫ్యాషన్ స్టోర్‌లో దుస్తులు ఎలా అమర్చాలి? ఏ తరహా డిజైన్లకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతారు? ప్రకటనల్లో ఎలాంటి ప్రచార శైలి ఉండాలి? కస్టమర్లను ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సాధారణంగా కంపెనీల మార్కెటింగ్ నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులు సమాధానాలు వెతుకుతుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ ప్రముఖ ఫ్యాషన్ సంస్థ మాత్రం ఈ బాధ్యతను టీనేజర్ల చేతుల్లో పెట్టింది. పాఠశాల వయసులో ఉన్న పిల్లల నుంచి యువత వరకు తమ అభిప్రాయాలు చెప్పడమే కాదు.. కంపెనీ నిర్ణయాలపై ప్రభావం చూపించే అవకాశాన్ని కల్పించింది. వారి ఆలోచనలకు విలువనిస్తూ వ్యాపార భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది.
బోర్డు గదిలోకి యువతరం
అమెరికాకు చెందిన ఫ్యాషన్ రిటైలర్ ‘ప్యాక్‌సన్’ ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సంస్థ సీఈఓ బ్రియానే ఓల్సన్ 13 నుంచి 22 ఏళ్ల వయసున్న 15 మందితో ప్రత్యేకంగా 'యూత్ అడ్వైజరీ కౌన్సిల్'ను ఏర్పాటు చేశారు. వీరు కేవలం పేరుకు సలహాదారులు కాదు. కంపెనీ ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడతారు. సీఈఓతోనూ తమ అభిప్రాయాలను పంచుకుంటారు. స్టోర్లలో వస్తువుల అమరిక నుంచి ప్రకటనల రూపకల్పన, కస్టమర్లకు అందించే అనుభవం వరకు అనేక అంశాలపై సూచనలు చేస్తారు.
యువతను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం చేసే సంస్థలు వారి అభిరుచులను అర్థం చేసుకోవడం అత్యంత కీలకం. ఆ అభిరుచులు వేగంగా మారుతున్నప్పుడు పాత పద్ధతులతోనే ముందుకెళితే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే యువత ఏం కోరుకుంటోంది? ఏది నచ్చడం లేదు? ఏ కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తోంది? వంటి విషయాలను వారి నుంచే తెలుసుకోవాలని ప్యాక్‌సన్ నిర్ణయించింది.
సలహాలకే పరిమితం కాదు..
ఈ కౌన్సిల్ సభ్యులకు కంపెనీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. తమకు నచ్చని విధానాలను నిర్మొహమాటంగా చెప్పొచ్చు. కొత్త ఆలోచనలను ప్రతిపాదించవచ్చు. మార్కెట్‌లో వస్తున్న మార్పులను గుర్తించి సంస్థ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఏడాదికి ఒకసారి కంపెనీ ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో కీలక అంశాలపై చర్చిస్తారు.
వీరి సూచనలు ఇప్పటికే కొన్ని మార్పులకు దోహదపడ్డాయి. స్టోర్లలో దుస్తులు, ఇతర ఉత్పత్తులను ఏ విధంగా అమర్చితే కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుందో సలహాలిచ్చారు. స్టోర్లలో వినియోగదారుల కదలికలను పరిశీలించి మెరుగుదలలు సూచించారు. పోటీ సంస్థల వ్యాపార విధానాలను విశ్లేషించి, వాటికి భిన్నంగా ప్యాక్‌సన్ ఏం చేయవచ్చో వివరించారు. అంటే యువత అభిప్రాయాలు సమావేశాలకే పరిమితం కాకుండా వ్యాపార నిర్వహణలోనూ ఉపయోగపడుతున్నాయి.
వెయ్యి మందికి పైగా ఆసక్తి
ఈ కార్యక్రమానికి యువత నుంచి వచ్చిన స్పందన సంస్థ అంచనాలను మించింది. 2024-25లో తొలి కౌన్సిల్ సభ్యులను ప్యాక్‌సన్ స్వయంగా ఎంపిక చేసింది. తర్వాతి విడతలో మాత్రం 2026-27 బృందం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దాదాపు వెయ్యి మంది యువత ఇందులో భాగమవ్వాలని ఆసక్తి చూపారు.
ఈ స్పందనతో సంస్థ మరో అడుగు ముందుకేసింది. కౌన్సిల్ సభ్యులకే కాకుండా మరింత మంది యువతకు అవకాశం కల్పించేందుకు అంబాసిడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 13 నుంచి 22 ఏళ్ల వయసున్న సుమారు 300 మంది యువత సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. డిజైన్, స్టైలింగ్, విజువల్ ఆర్ట్స్, కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ వంటి తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఆలోచనలు పంచుకుంటున్నారు.
యువతపై నమ్మకమే పెట్టుబడి
జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాల గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయని సీఈఓ బ్రియానే ఓల్సన్ అభిప్రాయపడ్డారు. యువతకు బాధ్యతలు అప్పగిస్తే వారు ఎంత సమర్థంగా వ్యవహరించగలరో ఈ కార్యక్రమం ద్వారా చూపించాలనుకుంటున్నారు. కౌన్సిల్ సభ్యులకు కంపెనీ నాయకత్వంతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండటంతో పాటు అనుభవజ్ఞుల నుంచి మార్గదర్శకత్వం కూడా లభిస్తోంది. భవిష్యత్తులో బ్రాండ్ ఎలా ఉండాలనే దానిని రూపొందించడంలో వారికీ పాత్ర దక్కుతోంది.
గత ఏడాది 970 మిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదు చేసిన ప్యాక్‌సన్.. మారుతున్న ఫ్యాషన్ మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటోంది. యువతను కేవలం వినియోగదారులుగా చూడకుండా, వ్యాపార రూపకల్పనలో భాగస్వాములుగా మార్చడం ద్వారా వారి అవసరాలను మరింత దగ్గరగా అర్థం చేసుకోవచ్చని భావిస్తోంది.
ఆలోచనలకు వేదికగా పర్పస్ సమ్మిట్
యువత నుంచి కొత్త ఆలోచనలు రాబట్టేందుకు ప్యాక్‌సన్ మరో కార్యక్రమాన్నీ నిర్వహిస్తోంది. గత రెండేళ్లుగా 'పర్పస్ సమ్మిట్' పేరుతో సదస్సులు ఏర్పాటు చేస్తోంది. వీటిలో యూత్ కౌన్సిల్ సభ్యులతో పాటు బ్రాండ్ భాగస్వాములు, కంపెనీ అధికారులు, క్రియేటర్లు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొంటున్నారు. స్నాప్‌చాట్, పిన్‌ట్రెస్ట్, టిక్‌టాక్ వంటి టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు, సెలీనా గోమెజ్‌కు చెందిన 'రేర్ ఇంపాక్ట్ ఫండ్' వంటి సేవా సంస్థలూ ఇందులో భాగమయ్యాయి.
ఒకరోజు పాటు జరిగే ఈ సదస్సులో వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే వ్యాపార విధానాలపై చర్చిస్తారు. యువత అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ సంస్థలు తమ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవచ్చో ఈ కార్యక్రమం చాటిచెబుతోంది.