- డేనియల్ క్రెయిగ్ తర్వాత బాండ్ పాత్రను పోషిస్తున్న ఏడో నటుడు
- అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న 26వ బాండ్ చిత్రానికి డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం
- 'పీకీ బ్లైండర్స్' క్రియేటర్ స్టీవెన్ నైట్ రచన, అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాణం
- బాండ్ అధికారిక ట్రేడ్‌మార్క్ టక్సేడో సూట్లో ప్యాటిన్సన్ ఫస్ట్ లుక్
- ఈ పాత్ర దక్కడం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమన్న రాబర్ట్ ప్యాటిన్సన్
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేమ్స్ బాండ్ పాత్రలోకి అడుగుపెట్టనున్నాడు. డేనియల్ క్రెయిగ్ వారసుడిగా ఏజెంట్ 007గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ అవకాశం దక్కడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని 40 ఏళ్ల ప్యాటిన్సన్ హర్షం వ్యక్తం చేశాడు. బ్రిటిష్ గూఢచారి జేమ్స్ బాండ్‌గా వెండితెరపై కనిపించనున్న ఏడో నటుడిగా అతడు చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు సీన్ కానరీ, జార్జ్ లాజెన్బై, రోజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ ఈ పాత్రను పోషించారు.
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఆధ్వర్యంలో రానున్న 26వ జేమ్స్ బాండ్ రీబూట్ చిత్రంలో ప్యాటిన్సన్ నటించనున్నాడు. 2025లో ఈ ఫ్రాంచైజీ హక్కులను అమెజాన్ ఎంజీఎం సంస్థ సుమారు ఒక బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించనున్నాడు. పీకీ బ్లైండర్స్ ఫేమ్ స్టీవెన్ నైట్ కథను అందిస్తున్నాడు. ఎమీ పాస్కల్, డేవిడ్ హేమన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధికారిక ప్రకటన అనంతరం బాండ్ ట్రేడ్‌మార్క్ టక్సేడో సూట్లో ప్యాటిన్సన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం జోష్ ఓ'కానర్, కల్లమ్ టర్నర్ పేర్లను కూడా పరిశీలించినట్లు సమాచారం.
జేమ్స్ బాండ్ వంటి లెజెండరీ పాత్రను తనకు అప్పగించడం సంతోషంగా ఉందని ప్యాటిన్సన్ పేర్కొన్నారు. డెనిస్ విల్లెనెవ్, నిర్మాణ సంస్థ నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. బాండ్ పాత్రకు ప్యాటిన్సన్ సరికొత్త శైలిని తీసుకువస్తారని దర్శకుడు డెనిస్ ప్రశంసించారు. 'హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్', 'ట్విలైట్' చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్యాటిన్సన్.. 'ది బ్యాట్‌మ్యాన్' (2022) చిత్రంలో బ్రూస్ వేన్గా మెప్పించారు. 2026లో 'ది ఒడిస్సీ'లో కనిపించిన ఆయన, 2028లో విడుదల కానున్న 'ది బ్యాట్‌మ్యాన్ 2'లోనూ నటించనున్నారు.