- ఉనద్కత్ ఫేక్ బౌలింగ్‌తో నెట్టుకొస్తున్నాడన్న మాజీ కెప్టెన్ శ్రీకాంత్
- ఎస్‌ఆర్‌హెచ్ అతడిని ఎందుకు రిలీజ్ చేయలేదని వ్యాఖ్య
- నటరాజన్ ఐపీఎల్ సీజన్లలో మాత్రమే బౌలింగ్ చేస్తున్నాడని విమర్శ
- కొందరు ఐపీఎల్ సమయంలోనే ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారని విమర్శ
- హర్షల్ గుజరాత్‌కు, షమీ రాజస్థాన్‌కు ట్రేడ్ అయ్యే అవకాశాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌పై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఉనద్కత్ తన 'ఫేక్ బౌలింగ్'తో ఇంత కాలం నెట్టుకొచ్చాడంటూ విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్ ట్రేడింగ్‌లో భాగంగా హర్షల్ పటేల్.. గుజరాత్ టైటాన్స్ (జీటీ)కి మారనున్నారన్న వార్తల నేపథ్యంలో శ్రీకాంత్ ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళంపై తన యూట్యూబ్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఉనద్కత్‌ను ఇంకా జట్టులోనే ఎందుకు అట్టిపెట్టుకుందో అర్థం కావడం లేదంటూ శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడిని కేవలం ఒక వర్క్‌హార్స్‌లా చూస్తూ జట్టులో ఉంచుతున్నారని అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో అతడికి చోటు ఎలా దక్కుతుందో కూడా తెలియదని ఎద్దేవా చేశాడు. ఎవరైనా గాయపడితే ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతోనే పక్కన పెట్టి ఉంచారని విమర్శించాడు. ఇదే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ ద్వారా ఎస్‌ఆర్‌హెచ్‌లోకి వచ్చిన టి.నటరాజన్‌పైనా శ్రీకాంత్ పెదవి విరిచాడు. ఉనద్కత్‌కు, నటరాజన్‌కు పెద్దగా తేడా ఏమీ లేదని, కొందరు కేవలం ఐపీఎల్ సీజన్ల సమయంలోనే ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారని విమర్శించాడు. మిగతా సమయాల్లో ఫిట్‌నెస్ సాధన పేరిట తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మరోవైపు ఐపీఎల్ 2025 వేలంలో రూ.8 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ సొంతం చేసుకున్న హర్షల్ పటేల్.. 2026 సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ బౌలర్లు రాణించడంతో హర్షల్‌ను రూ.4 కోట్ల ధరకు గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు బదులుగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి మహమ్మద్ షమీ రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.