- నిర్మాణంలో ఉన్న భవనంలోకి చొరబడిన భారీ పాము
- భయంతో పరుగులు తీసిన స్థానిక ప్రజలు
- స్నేక్ క్యాచర్‌తో పామును సురక్షితంగా పట్టివేత
- ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. వి. మాడుగుల మండలం కేజే పురం గ్రామంలోని మసీదు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి మంగళవారం 13 అడుగుల పొడవైన గిరినాగు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. నిర్మాణంలో ఉన్న భవనంలోకి భారీ పాము చొరబడటాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే వారు పాములు పట్టే వెంకటేశ్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంకటేశ్, చాకచక్యంగా ఆ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పామును పట్టుకునే దృశ్యాలను చూసేందుకు భవనం వద్దకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పాల్లో ఒకటైన కింగ్ కోబ్రాలు ఈ ప్రాంతంలోని అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. భారీ పామును సురక్షితంగా బంధించడంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును అటవీ శాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని అడవిలో సురక్షితంగా వదిలివేశారు.