- పెద్దలకు టికెట్ ధర రూ.10 నుంచి రూ.20కి పెంపు
- పిల్లలకు ఎంట్రీ ఫీజు రూ.2 నుంచి రూ.5కి పెంపు
- ఇందిరా పార్కు, జలగం వెంగళరావు పార్కు సహా పలు చోట్ల కొత్త ధరలు అమలు
- తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఫీజులను సవరించిన అధికారులు
హైదరాబాద్ నగర పరిధిలోని ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుమును పెంచుతూ జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. పెద్దల టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి రెట్టింపు చేయగా, పిల్లల టికెట్ ధరను రూ.2 నుంచి రూ.5కి పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పార్కుల ప్రవేశ రుసుము పెంపు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో ఇందిరా పార్కు, నారాయణగూడలోని మేల్కొటే పార్కు, జలగం వెంగళరావు పార్కు, కృష్ణకాంత్ పార్కు వంటి ప్రధాన పార్కుల్లో కొత్త టికెట్ ధరలు వర్తిస్తాయి. 12 ఏళ్లు దాటిన వారిని పెద్దలుగా పరిగణించి రూ.20, ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.5 చొప్పున రుసుము వసూలు చేస్తారు.
పార్కుల్లోకి ప్రవేశ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో మాదిరిగానే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు సందర్శకులకు టికెట్లు జారీ చేస్తారు. జీహెచ్ఎంసీ చివరిసారిగా 2017లో పార్కుల ప్రవేశ రుసుమును రూ.5 నుంచి రూ.10కి పెంచింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి ఫీజులను సవరించినట్లు అర్బన్ బయోడైవర్సిటీ విభాగం వర్గాలు తెలిపాయి.