- తన పాత గర్ల్‌ఫ్రెండ్ ప్రస్తుతం తనకు మంచి స్నేహితురాలన్న రాహుల్ గాంధీ
- కేంబ్రిడ్జ్‌లోని 'ది వర్సిటీ రెస్టారెంట్' సందర్శనపై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న రాహుల్
- సోనియా గాంధీ నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని వెల్లడించిన ప్రతిపక్ష నేత
- రాజీవ్ హత్య తర్వాత రాహుల్ అమెరికాలో పేరు మార్చుకుని చదువుకున్నారని సోనియా వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లి సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రోజుల్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె గురించి సభలో ప్రశ్నించగా.. ‘‘ఆమె ఇప్పుడు నాకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమే’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
గతంలో తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని ‘ది వర్సిటీ రెస్టారెంట్’ను చూసేందుకు తన నాటి గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన సందర్భాన్ని రాహుల్ వివరించారు. అక్కడ ఆర్డర్ ఇచ్చే సమయంలో తన తల్లిదండ్రుల విషయాన్ని చెప్పగానే, అక్కడి సిబ్బంది దశాబ్దాల తర్వాత కూడా వారిని గుర్తుపట్టి మాట్లాడటం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
ఇదే వేదికపై తన తల్లి ఆరోగ్యం గురించి రాహుల్ గాంధీ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పుస్తకంలో చాలా తక్కువ చేసి రాసుకున్నప్పటికీ, సోనియా గాంధీ ఏకంగా నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించారని వెల్లడించారు. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆమె ఎన్నడూ భయపడలేదని, వెనకడుగు వేయలేదని ప్రశంసించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్‌ను హార్వర్డ్ నుంచి మరో అమెరికన్ కాలేజీకి మార్చి, అసలు పేరు మార్చి చదివించాల్సి వచ్చిన క్లిష్ట పరిస్థితులను సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.