- దక్షిణ కొరియా ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన అభ్యర్థి
- ఏఐ సహాయంతో చీటింగ్ చేసినట్టు అంగీకారం
- మైక్రో కెమెరా, స్మార్ట్ఫోన్తో ప్రశ్నలకు సమాధానాలు పొందిన వైనం
- దేశవ్యాప్త ప్రవేశ పరీక్షల ముందు ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
- పోలీసులకు లొంగిపోయి నేరం ఒప్పుకున్న నిందితుడు
దక్షిణ కొరియాలో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. దేశంలో అత్యంత కఠినమైన జాతీయ ట్యాక్స్ అకౌంటెంట్ అర్హత పరీక్షలో టాపర్‌గా నిలిచిన ఓ అభ్యర్థి.. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చీటింగ్ చేసినట్లు అంగీకరించాడు. దాదాపు ఫుల్ మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన అతను, చివరికి తానే స్వయంగా నేరం ఒప్పుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
సదరు అభ్యర్థి, ఆదివారం ఓ యూట్యూబ్ ఛానెల్ వీడియో ద్వారా తన తప్పును ఒప్పుకున్నాడు. పరీక్ష సమయంలో ఏఐ గ్లాసెస్ పెట్టుకొని ప్రశ్నలను ఫొటోలు తీశానని, ఏఐ టూల్ ద్వారా ఫోన్‌కు పంపి సమాధానాలు రాశానని వివరించాడు. తాను నిజాయితీగా విజయం సాధించలేదని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు.
ఏప్రిల్, జులై నెలల్లో జరిగిన ఈ పరీక్షలో హాన్ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. మొదటి రౌండ్‌లో 400 మార్కులకు గాను 397.5 మార్కులు సాధించాడు. మొత్తం 160 ప్రశ్నలకు 159 సరైన సమాధానాలు రాయడంతో అతనిపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతను తన న్యాయవాది ద్వారా సియోల్ పోలీసులకు లిఖితపూర్వకంగా వాంగ్మూలం సమర్పించాడు. ఈ వాంగ్మూలం అందిందని పోలీసులు ధ్రువీకరించారు.
ఈ గురువారం దేశవ్యాప్తంగా జరగనున్న వార్షిక కాలేజీ ప్రవేశ పరీక్షల ముందు ఈ ఘటన వెలుగులోకి రావడంతో దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. అధ్యక్ష భవనం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి మోసాలను అరికట్టేందుకు అత్యవసర చర్యలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.