- దీపావళి సందర్భంగా అర్హులైన వినియోగదారులకు యాక్ట్ ఫైబర్‌నెట్ ఆఫర్
- అదనపు ఛార్జీ లేకుండా ఇంటర్నెట్ వేగం పెంచుకునే వీలు
- 100 ఎంబీపీఎస్ కంటే తక్కువ ప్లాన్ ఉన్నవారికి 100 ఎంబీపీఎస్ వేగం
- 100-299 ప్లాన్ వారికి 300, 300-499 ప్లాన్ వారికి 500 ఎంబీపీఎస్ వేగం
- యాప్‌లో ఆఫర్‌ను పొందే వీలు
బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు యాక్ట్ ఫైబర్‌నెట్ శుభవార్త తెలిపింది. ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండానే అధిక ఇంటర్నెట్ వేగం పొందే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. దీపావళి సందర్భంగా పరిమిత కాలానికి ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయం అర్హత ఉన్న కొందరు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాన్‌ను బట్టి కొత్త స్పీడ్‌ను సంస్థ నిర్ణయించింది. 100 ఎంబీపీఎస్ కంటే తక్కువ వేగం ఉన్న ప్లాన్ వాడుతున్నవారికి 100 ఎంబీపీఎస్ వేగం లభిస్తుంది. 100 నుంచి 299 ఎంబీపీఎస్ ప్లాన్ ఉన్నవారికి 300 ఎంబీపీఎస్‌కు పెంచుతారు. ప్రస్తుతం 300 నుంచి 499 ఎంబీపీఎస్ వేగంతో సేవలు పొందుతున్నవారికి 500 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తారు.
అంటే తక్కువ వేగం ఉన్న ప్లాన్ వినియోగదారులకు కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఒకేసారి ఇంట్లో పలువురు వీడియోలు చూడటం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, వీడియో సమావేశాల్లో పాల్గొనడం వంటి పనులు చేసుకునేందుకు 500 ఎంబీపీఎస్ వేగం ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.
ఈ ఆఫర్ పొందాలనుకునే అర్హులైన వినియోగదారులు యాక్ట్ ఫైబర్‌నెట్ అధికారిక మొబైల్ యాప్ ద్వారా తమ ప్లాన్ వేగాన్ని పెంచుకోవచ్చు. అయితే ఇది తాత్కాలిక సదుపాయం మాత్రమే. ఎంతకాలం అందుబాటులో ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయలేదు.
అందరికీ ఈ సదుసాయం అందుబాటులో ఉండదు. సేవలు నిలిచిపోయిన ఖాతాలు, చాలా కాలంగా వినియోగంలో లేని కనెక్షన్లు, బిల్లులు చెల్లించకుండా బకాయిలు ఉన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. ఇతర అనర్హత జాబితాల్లో ఉన్న వినియోగదారులకూ అవకాశం ఉండదు. గరిష్ఠంగా 500 ఎంబీపీఎస్ వేగం వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సంస్థ అందించే 1 జీబీపీఎస్ ప్లాన్ దీనిలో లేదు.