- 'బౌలీ ఆర్ట్ సంఘం' చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి నియామకం
- వారసత్వ బావుల పరిరక్షణ ఉద్యమంలో కీలక బాధ్యతల్లో అల్లు స్నేహారెడ్డి
- డిసెంబర్ 1 నుంచి 'బౌలీ ఆర్ట్ సంఘం' ఉత్సవాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, వ్యాపారవేత్త అల్లు స్నేహారెడ్డికి కళా, సాంస్కృతిక రంగాల్లో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 'బౌలీ ఆర్ట్ సంఘం' కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగానికి ఫౌండింగ్ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. భారతదేశంలోనే మొట్టమొదటి 'స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే'గా గుర్తింపు పొందిన ఈ ఉద్యమానికి ఆమె ప్రధాన సారథిగా వ్యవహరించనున్నారు.
దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పురాతన మెట్ల బావుల (బావోలీలు) చారిత్రక, పర్యావరణ విశిష్టతను నేటి తరానికి చాటిచెప్పడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 'ది రెయిన్వాటర్ ప్రాజెక్ట్'కు చెందిన కల్పనా రమేశ్, 'ఏక్ చిత్ర'కు చెందిన అన్నపూర్ణ మాదిపాడిగ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ పురాతన బావులను కళా వేదికలుగా తీర్చిదిద్ది ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్నేహారెడ్డిని ఈ ప్రాజెక్ట్ ముఖచిత్రంగా ఎంపిక చేశారు.
ఈ క్రమంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 10 వరకు దాదాపు 40 రోజుల పాటు భారీ స్థాయిలో బౌలీ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. బన్సీలాల్‌పేట్, గోల్కొండ, రాష్ట్రపతి నిలయం, ఫలక్‌నుమా తదితర 13కు పైగా చారిత్రక ప్రాంతాల్లో 200 మందికి పైగా కళాకారులతో ప్రదర్శనలు, చర్చలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ బాధ్యతలపై స్నేహారెడ్డి స్పందిస్తూ... "బౌలీ ఆర్ట్ సంఘంలో ఈ కొత్త బాధ్యత చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మన నగరం యొక్క చరిత్ర, వారసత్వ సంపదపై ముఖ్యంగా యువతరంలో మరింత అవగాహన పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. భావితరాల కోసం మన సంస్కృతిని కాపాడే దిశగా ఇది ఒక అర్థవంతమైన అడుగు" అని పేర్కొన్నారు.