- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఖండించిన జగన్
- బ్యాలెట్ బాక్సుల తరలింపును ప్రశ్నించినందుకు అరెస్టు చేశారని ఆరోపణ
- టీడీపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శ
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై తప్పుడు కేసులు బనాయించి, నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే పాలన నడుస్తోందని, ఇది అత్యంత హేయమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిశాక, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దించారని జగన్ ప్రశ్నించారు. ఈ అక్రమాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. తప్పు చేసి, బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేస్తూ, మళ్లీ తమ వారిపైనే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెట్టడం కంటే దుర్మార్గం ఏముంటుందని నిలదీశారు.
ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి, "ఈ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల నుంచి బ్యాలెట్ బాక్సుల వరకు అన్నింటినీ రిగ్గింగ్ చేస్తున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? అధికార, పోలీసు బలంతో అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తోంది. ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు" అని జగన్ తన ట్వీట్లో హెచ్చరించారు.