- వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అక్రమాలకు పాల్పడ్డారని సుధాకర్ బాబు ఆరోపణ
- ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్య
- వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా (ఫ్రీ అండ్ ఫెయిర్) నిర్వహించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు.
"స్థానిక సంస్థల ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించామని సీఎం చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు ఇలాంటి ఎన్నికలు గతంలో చూడలేదు. భవిష్యత్‌లో కూడా చూడము. చంద్రబాబు ఓ మాఫియా డాన్ మాదిరిగా వ్యవహరించి ఎన్నికలను నిర్వహించి.. ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించామని చెప్పడం సిగ్గుచేటు" అని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.