- గుంటూరు జైల్లో లేళ్ల అప్పిరెడ్డిని ములాఖత్‌లో పరామర్శించిన అంబటి రాంబాబు
- కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ఆరోపణ
- చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా జైలుకు పంపారని మండిపాటు
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని... ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతోనే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
ప్రశాంతంగా ఉండే గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం దుష్ట సంప్రదాయాలకు తెరతీసిందని అంబటి విమర్శించారు. "ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్‌ను కిందకు ఎందుకు దించారు? ఓ చిన్న ఘటనను అడ్డంపెట్టుకుని కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం. ఎలాగైనా సరే అప్పిరెడ్డిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో లోకేశ్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కుట్ర పన్నారు" అని అంబటి ఆరోపించారు.
వైసీపీ చురుగ్గా పనిచేస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని జైళ్లకు పంపే కుట్రలు జరుగుతున్నాయని, అయితే ఇలాంటి చర్యలకు పార్టీ నేతలు ఎవరూ భయపడబోరని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సు తరలింపు వివాదంలో విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో నవంబర్ 6న పోలీసులు అప్పిరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.