- పరివర్తన రాజనీతి పార్టీని ప్రకటించిన విజయసాయిరెడ్డి
- వైసీపీలో 70కి పైగా అవమానాలను భరించానని ఆవేదన
- ఆ పార్టీ నుంచి తనను గెంటేశారని వెల్లడి
- అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు తమ పార్టీలో చేరుతున్నారన్న విజయసాయి
- ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడి
వైసీపీలో తాను తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్‌పీ) అధినేత విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో తన పార్టీని ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వైసీపీని స్వచ్ఛందంగా వీడలేదని, తనను అవమానించి బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపించారని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీలో ఉన్న సమయంలో తాను 70కి పైగా అవమానాలను భరించానని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషి తట్టుకోలేని రీతిలో అక్కడ అవమానాలు జరిగాయని, ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఎవరూ ఉండలేరని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ కొందరి చెప్పుడు మాటలు విని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనను చివరకు అవమానకర రీతిలో బయటకు నెట్టారని పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు, నాయకులు తమ కొత్త పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.